iDreamPost
android-app
ios-app

వీడియో: దారుణం.. కుక్కలకు విషం పెట్టి చంపిన దుండగులు

  • Published Jul 29, 2023 | 7:26 PM Updated Updated Jul 29, 2023 | 7:26 PM
  • Published Jul 29, 2023 | 7:26 PMUpdated Jul 29, 2023 | 7:26 PM
వీడియో: దారుణం.. కుక్కలకు విషం పెట్టి చంపిన దుండగులు

ఈ మధ్యకాలంలో వీధి కుక్కులు రెచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో ఇప్పటికీ కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరి కొందర పిల్లలు తీవ్రంగా గాయపడ్డ ప్రాణాలతో బయటపడ్డ ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. దీంతో అప్పటి నుంచి పిల్లల పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మధ్య ప్రదేశ్ లో ఇటీవల ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు నోరు లేని వీధి కుక్కల పట్ల జాలి, దయ లేకుండా వాటికి విషం పెట్టి దారుణంగా చంపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబాల్ పూర్ బజాపాయి పరిధిలోని పెంటి నాకలో కొందరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. నోరులేని మూడు వీధి కుక్కల పట్ల కర్కశంగా వ్యవహరించారు. వాటికి తినే ఆహారంలో విషం పెట్టి వాటి ముందు ఉంచారు. అది తిన్న ఆ మూడు కుక్కలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ నోరు లేని కుక్కలు విలవిలలాడుతూ మరణించాయి. ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో చూసిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ ఇస్లామియా వర్సిటీలో సె*క్స్ కుంభకోణం.. వీడియోలు లభ్యం!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet