iDreamPost

పాకిస్తాన్ ఇస్లామియా వర్సిటీలో సె*క్స్ కుంభకోణం.. వీడియోలు లభ్యం!

పాకిస్తాన్ ఇస్లామియా వర్సిటీలో సె*క్స్ కుంభకోణం.. వీడియోలు లభ్యం!

పాకిస్తాన్ ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఒక భారీ సె*క్స్ కుంభకోణం వెలుగు చూసింది. విద్యార్థినులకు సంబంధించిన 5,500 పో*ర్న్ వీడియోలు బయటపడ్డాయి. మాదకద్రవ్యాలు ఇచ్చి విద్యార్థినులతో ఇలాంటి వీడియోలు తీయించారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అవన్నీ మాదకద్రవ్యాలకు బానిసలైన విద్యార్థుల వీడియోలుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త పాకిస్తాన్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసులు ఈ మొత్తం వీడియోలను సీజ్ చేశారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ మొత్తం ఘటనలో కేంద్ర మంత్రి చౌదరీ తారిక బాషిర్ చీమా కొడుకు పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పో*ర్న్ వీడియో, మాదక ద్రవ్యాల దందా వెనుక అతనే మాస్టర్ మైండ్ గా భావిస్తున్నారు. అతను సరఫరా చేసే డ్ర*గ్స్ వల్లే ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థినులు ఈ సె*క్స్ ఊబిలోకి దిగుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్తలు వెలుగు చూసిన తర్వాత కేంద్ర మంత్రి తన కుమారుడిని రక్షించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును ఎలాగైనా ఛేదించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐదు బృందాలుగా విడిపోయి మొత్తం యూనివర్సిటీలో దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మేజర్ ఇజాజ్ షా వద్ద కొన్ని అశ్లీల వీడియోలు లభ్యం కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ వీడియోల్లో విద్యార్థులు మాత్రమే కాకుండా సిబ్బంది కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఆ అధికారి వద్ద అప్రోడిసియాక్ పిల్స్ తో పాటుగా డ్ర*గ్స్ కూడా లభించాయి. ఇజాజ్ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఆధారాలు, వివరాలు సేకరించేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ వీడియోల వ్యవహారం బయటకు రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రముఖ యూనివర్సిటీ కావడంతో వారి పేరు ప్రఖ్యాతలు దెబ్బతినకుండా త్వరగా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలంటూ కోరారు. ఈ విషయంలో వర్సిటీ ట్రెజరీని కూడా అరెస్ట్ చేశారు. కోశాధికారి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోన్లలో వీడియోలు దొరకడం మాత్రమే కాకుండా ఈ కుంభకోణానికి సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా లభ్యమైంది. వీళ్లు ఉద్యోగులు, స్టూడెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేసి ఇలాంటి వీడియోలు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రెజరర్ తాను చేసిన తప్పులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాను ఉపాధ్యాయులతో కలిసి స్టూడెంట్స్ ద్వారా మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు.. ప్రొఫెసర్లు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కుంభకోణం ఇప్పటిది కాదని.. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉందని పోలీసులు వ్యాఖ్యానించారు. ఈ యూనివర్సిటీ రాకెట్ వార్త ఒక్క పాకిస్తాన్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి