iDreamPost
android-app
ios-app

VIDEO:పట్టపగలు నడి రోడ్డుపై సర్పంచ్ ను హత్య చేసిన దుండగులు!

  • Published Oct 10, 2023 | 2:30 PM Updated Updated Oct 10, 2023 | 2:30 PM
  • Published Oct 10, 2023 | 2:30 PMUpdated Oct 10, 2023 | 2:30 PM
VIDEO:పట్టపగలు నడి రోడ్డుపై సర్పంచ్ ను హత్య చేసిన దుండగులు!

మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న ఓ సర్పంచ్ ను కొందరు దుండగులు వెంబడి పట్టపగలు నడి రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపారు. ఒకరి తర్వాత ఒకరు ఏకంగా 5 మంది దుండుగులు హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని బన్హేరి కు చెందిన విక్రమ్ రావత్ (35) అనే వ్యక్తి ఆ గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇతడు ఇటీవల గ్వాలియర్‌ లోని ఓ లాయర్ ను కలిసేందుకు కారులో బయలుదేరాడు. కాగా, అప్పటికే కొందరు యువకులు విక్రమ్ రావత్ ఫాలో అవుతూ వస్తున్నారు. ఇక అతడు కారు దిగే లోపలికి వెళ్లే క్రమంలోనే ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి విక్రమ్ రావత్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. మరికొంత మంది అక్కడికి చేరుకుని మరోసారి అతడిపై కాల్పులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విక్రమ్ రావత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలోని ప్రత్యర్థులే విక్రమ్ రావత్ ను హత్య చేసి ఉంటారని విక్రమ్ రావత్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom