Dharani
Dharani
పదిరోజుల క్రితం కనిపించకుండ పోయిన బీజేపీ నేత.. శవమై నదిలో కనిపించింది. ఈకేసుకు సంబంధించి మహిళా నేత భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన సనాఖాన్.. బీజేపీ మైనార్టీ సెల్ సభ్యురాలిగా పని చేస్తోంది ఈ క్రమంలో ఆగస్ట్ 1న ఆమె తన భర్తను కలిసేందుకు మధ్యప్రదేశ్, జబల్‌పూర్‌కి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించడం లేదు. అయితే సనా జబల్ పూర్‌కు చేరుకున్న తర్వాత తన తల్లికి కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
జబర్‌పూర్‌కు చేరుకున్న సన.. తన తల్లికి కాల్ చేసి.. భర్త అమిత్ సాహును కలిశానని.. మరో రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు సమాచారం. రెండు రోజుల తర్వాత కూడా ఆమె ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో.. పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సనాఖాన్ భర్త అమిత్ సాహుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సనాఖాన్ భర్త అమిత్ సాహు దాబా నిర్వహించడమే కాక మద్యం అక్రమ రవాణా వ్యాపారం చేస్తుంటాడని తెలిసింది.
ఇక డబ్బులకు సంబంధించి సనా, అమిత్ సాహుల మధ్య తరచు గొడవలు జరిగేవని తెలిసింది. ఇక సనా జబల్‌పూర్‌కి వచ్చిన సమయంలో కూడా దంపతుల మధ్య డబ్బుల విషమై గొడవలు జరిగాయి. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో.. విచక్షణ కోల్పోయిన సాహు.. ఆవేశంలో సనా మీద దాడి చేశాడు. ఇంట్లోనే ఆమె మృతి చెందింది. ఆ తర్వాత సనా మృతదేహాన్ని తీసుకెళ్లి.. హిరాన్ నదిలో పడేశానని సాహు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు సనా మృతదేహం కోసం గాలిస్తున్నారు. అలానే ఈ కేసులో మరో అనుమాతుడిని అదుపులోకి తీసుకున్నారు.