iDreamPost
android-app
ios-app

మచిలీపట్నంలో దారుణం.. ప్రముఖ వైద్యుడి భార్య హత్య!

  • Published Jul 26, 2023 | 11:58 AM Updated Updated Jul 26, 2023 | 11:58 AM
  • Published Jul 26, 2023 | 11:58 AMUpdated Jul 26, 2023 | 11:58 AM
మచిలీపట్నంలో దారుణం.. ప్రముఖ వైద్యుడి భార్య హత్య!

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రముఖ వైద్యుడి భార్యను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. గొంతు కోసి ప్రాణాలు తీశారు. అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారంతో పాటు ఇంట్లోని నగదు, నగలు తీసుకుని పారిపోయారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమామహేశ్వర రావుకు చిన్న పిల్లల వైద్యుడిగా ఆ ప్రాంతంలో చాలా పేరుంది. ఆయన జువ్వారుపేటలో శ్రీవెంకటేశ్వర నర్సింగ్‌ హోమ్‌ను నిర్వహిస్తున్నాడు.

మంగళవారం రాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఉమామహేశ్వర రావు ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన భార్య రాధపై దాడి చేశారు. కత్తితో ఆమె గొంతును కోసి చంపారు. అనంతరం ఆమె మెడలోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తర్వాత ఇంట్లోని డబ్బు, నగదును కూడా దోచుకుని అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై డాక్టర్‌ ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ..

ఇది దోపిడీ దొంగల పనేనని అన్నారు. ఇంట్లో దోచుకోవటానికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని చెప్పారు. ఇక, పోలీసులు ఈ హత్యను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అది దోపిడీ దొంగల పనా.. లేక ఎవరైనా హత్య చేసి దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇంటికి దగ్గరలోని సీసీటీవీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. మరి, ప్రముఖ వైద్యుడి భార్య హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss