ఆ డబ్బు కోసం తండ్రిని చంపిన కొడుకు కథ! కోర్టుకి నిజం తెలిసి!

ఆ డబ్బు కోసం తండ్రిని చంపిన కొడుకు కథ! కోర్టుకి నిజం తెలిసి!

ఉన్నత చదువులు చదవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కొంత మంది ఆ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఎన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే కొందరు ఈ క్రమంలో తప్పుడు అడుగులు వేస్తుంటారు.

ఉన్నత చదువులు చదవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కొంత మంది ఆ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఎన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే కొందరు ఈ క్రమంలో తప్పుడు అడుగులు వేస్తుంటారు.

కొంత మంది ఉన్నత చదువుకోవాలని ఉన్నా.. ఆర్థిక స్థోమత సహకరించక మధ్యలోనే ఆపేస్తుంటారు. విదేశాలకు వెళ్లి ఎంఎస్ చేసి, బాగా చదువుకుని తల్లిదండ్రులకు అండగా నిలవాలని అనుకుంటారు. కానీ పేదరికం అడ్డుగోడగా మారుతుంది. దీంతో విదేశాల్లో చదువులు చదవాలన్న ఆకాంక్షలు చిదిమేసుకుని..చిన్న చితకా పనులు చేసుకుంటూ బతికేస్తుంటారు. కానీ కొంత మంది అవకాశాలు వెతుక్కుంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు, తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు స్కాలర్ షిప్స్, ఎడ్యుకేషన్ లోన్స్ వంటి అవకాశాలను ఎంచుకుంటారు. అయితే ఈ క్రమంలో కొంత మంది అడ్డదారులు తొక్కుతుంటారు. తాజాగా ఓ ఇండియన్ స్టూడెంట్ ఓ తప్పు పని చేసి అడ్డంగా దొరికిపోయాడు.

స్కాలర్ షిప్ కోసం బతికున్న తండ్రిని చంపేసి.. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడు.  అమెరికాలోని పెన్సిల్వేనియాలోని చదువుతున్న భారతీయ విద్యార్థి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. పోలీసులకు తెలిసి అతడ్ని అరెస్టు చేశారు.పెన్సిల్వేనియాలోని లెహీ యూనివర్సిటీలో చదువుతున్నాడు  భారతీయ విద్యార్థి ఆర్యన్ ఆనంద్. ఆర్యన్ స్కాలర్ షిప్ పొందేందుకు తన తండ్రి చనిపోయాడని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడమే కాకుండా.. నకిలీ ఈమెయిల్ అడ్రస్‌తో యూనివర్సిటీ ప్రిన్సిపాల్ సంతకాలను ఫోర్జరీ చేశాడు. ట్రాన్స్ స్క్రిప్టులు, టాక్స్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు, తండ్రి చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు వంటి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీని మోసం చేశాడు. అయితే తాను చేసిన మోసం గురించి.. అతడే చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తాను చేసింది తప్పు అని తెలుసుకున్న ఆర్యన్.. చిన్న పాటి గిల్లీ ఫీలింగ్‌తో రెడ్డిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఇది యూనివర్శిటీ దృష్టికి వెళ్లింది. తమను మోసం చేశాడని ఆర్యన్ పై యూనివర్శిటీ యాజమన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడ్ని పెన్సిల్వేనియా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అతడి తండ్రి జీవించి ఉన్నాడని, అతడు ఇండియాలో ఉన్నాడని కూడా విచారణలో తేలింది. స్కాలర్ షిప్ కోసమే ఇతడు ఇంతటి మోసానికి తెగబడ్డాడని తెలిసి.. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆర్యన్‌ను అరెస్టు చేసి.. ఫోర్జరీ, రికార్డుల ట్యాంపరింగ్, మోసం కింద పలు సెక్షన్లలో ఆనంద్ పై కేసులు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ఆర్యన్‌కు 25వేల డాలర్లు అంటే సుమారు రూ. 21 లక్షల జరిమానా విధించింది స్థానిక కోర్టు.. అలాగే ఇండియా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతడు యూఎస్ ఇమ్మిగ్రేషన్ , కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కస్టడీలో ఉన్నాడు.

Show comments