SNP
Kolkata, RG Kar Medical College: దేశాన్ని కుదిపేస్తున్న ‘కోల్‌కత్తా డాక్టర్ హత్యాచార’ ఘటన జరిగిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్తి చరిత్రను అక్కడ గతంలో జరిగిన దారుణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Kolkata, RG Kar Medical College: దేశాన్ని కుదిపేస్తున్న ‘కోల్‌కత్తా డాక్టర్ హత్యాచార’ ఘటన జరిగిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్తి చరిత్రను అక్కడ గతంలో జరిగిన దారుణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
‘ఆర్‌జీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’.. గత కొన్ని రోజులుగా మార్మోగిపోతున్న పేరు. 31 ఏళ్ల పోస్టు గ్రాడ్యూయేట్ మెడికల్ స్టూడెంట్ హత్యాచార ఘటన జరిగింది ఈ ఆస్పత్రిలోనే. ఈ కాలేజీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా మహానగరంలో ఉంది. ఈ నెల 9న ఈ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్‌కు గురైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారడంతో.. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఈ మెడికల్ కాలేజ్.. తనకు స్వాతంత్యం రాకముందు బ్రిటిష్ కాలంలో స్థాపించారు. 1886లో కలకత్తా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌గా స్థాపించారు. 1904లో నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ బెంగాల్‌లో విలీనం చేశారు. 1916లో బెల్గాచియా మెడికల్ కాలేజీగా పేరు మార్చారు. 1916లో బెంగాల్ గవర్నర్ థామస్ గిబ్సన్-కార్మైకేల్ గౌరవార్థం ఈ కళాశాలకు కార్మైకేల్ మెడికల్ కాలేజీగా మళ్లీ పేరు మార్చారు. 1948 వరకు అదే పేరు కొనసాగింది. కానీ, మనకు స్వాతంత్యం వచ్చిన తర్వాత.. డాక్టర్ రాధా గోబిందా కర్ గౌరవార్థం 1948 మే 12న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌గా పేరుపెట్టారు. డాక్టర్ రాధా గోబిందా కర్ ఈ మెడికల్ కాలేజ్‌కు మొదటి సెక్రటరీగా పనిచేశారు.
ఇలా 138 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ మెడికల్ కాలేజ్‌లో.. గత 23 ఏళ్లలో ఏకంగా మూడు ఘోరాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనతో దేశం మొత్తం ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఇదే తరుణంలో గతంలో ఇదే కాలేజీలో జరిగిన మరో రెండు దారుణాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అప్పుడు బలైంది కూడా అమ్మాయిలే. అసలు ఈ కాలేజ్‌లో అమ్మాయిలే ఎందుకు చనిపోతుంటారు? ముందు సూసైడ్‌గా ఉన్న కేసులు చివరికి హత్యలుగా ఎందుకు బయటపడుతున్నాయి. వీటి వెనుక ఉన్న చీకటి కోణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ సౌమిత్రా బిస్వాస్ 2001 ఆగస్టు 25న తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తొలుత ఆ అమ్మాయిది సూసైడ్‌గా భావించారు. కానీ, ఫ్యాన్‌కు వేలాడుతున్న డెడ్‌బాడీని కిందికి దింపి చూసిన తర్వాత.. ఆమె నోట్లో ఒక కర్చీఫ్ కుక్కి ఉంది. దాంతో.. ఆమెను ఎవరో హత్య చేసి.. ఇలా ఫ్యాన్‌కు వేలాడదీశారని పోలీసులు అనుమానించారు. పూర్తి విచారణ తర్వాత ఆ అనుమానమే నిజమైంది. సౌమిత్రా హత్యకు ముందు.. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ సెక్స్ రాకెట్‌కు అడ్డాగా ఉండేది. ఈ సెక్స్ రాకెట్‌లో చిక్కుకుని తన స్నేహితురాలు బాధపడుతున్నట్లు గుర్తించిన సౌమిత్రా బిస్వాస్.. ఈ వ్యవహారాన్ని ఎలాగైనా బయటపెట్టాలని అనుకుంది. ఈ విషయం ఆ సెక్స్ రాకెట్ వాళ్లకు తెలిసి.. ఆమెను పక్కా పథకం ప్రకారం హత్య చేసి.. హాస్టల్ రూమ్‌లోనే ఫ్యాన్‌కు వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
2001 తర్వాత.. అమ్మాయిలే కాకుండా మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఈ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నారు. 2003 ఫిబ్రవరీలో అర్జిత్ దత్తా, ప్రవీణ్ గుప్తా కాలేజ్ క్యాంపస్‌లో బలవ్మరణానికి పాల్పడ్డారు. అర్జిత్ దత్తా.. కాలేజ్ మెయిన్ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను హాస్పిటల్‌లో హౌజ్‌స్టాఫ్‌గా పనిచేసేవాడు. బిల్డింగ్ పై నుంచి దూకేముందు.. చేతి నరాలు కట్ చేసుకొని మరి దూకేశాడు. అతని ఆత్మహత్యకు కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. 2001లో సౌమిత్రా బిస్వాస్ హత్యకు కారణమైన సెక్స్ రాకెటే ఇతని మరణానికి కూడా కారణమైందా? అనే అనుమానాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి.
గత 23 ఏళ్లలో హత్యలు, ఆత్మహత్యలు చూసిన.. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తాజాగా పీజీ స్టూడెంట్ అత్యంత కిరాతకంగా హత్యాచారానికి గురైంది. ఈ నెల 8వ తేదీ రాత్రి ఆమెను రేప్ చేసి.. ఆపై అతి క్రూరంగా హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కాలేజ్ ఔట్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తించే సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాగే సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని.. మంగళవారం విచారించి.. వైద్య సిబ్బంది భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలకు ఒక నేషనల్ టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేసింది. మరి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఇలా హత్యలు చోటు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.