iDreamPost
android-app
ios-app

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోందని భార్యను చంపిన భర్త!

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోందని ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోందని ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోందని భార్యను చంపిన భర్త!

సాంకేతిక యుగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటు పిల్లల నుంచి అటు పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్ లు వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా యుగంలో కూడా మార్పులు వస్తున్నాయి. గతంలో టిక్ టాక్ ఉన్న సమయంలో అందరూ వీడియోలు చేసుకునేవారు. టిక్ టాక్ ద్వారా రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్లు కూడా లేకపోలేదు. దీంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది వీడియోలు చేస్తూ ఫేమస్ అవ్వాలని అనుకున్నారు. ఇక టిక్ టాక్ బ్యాన్ కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో అందరూ ఇన్‌స్టాగ్రామ్‌ మీద పడిపోయారు. అందులో రీల్స్ ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇక అచ్చం ఇలాగే అనుకున్న ఓ మహిళ.. ఇటీవల రీల్స్ చేసింది. ఇలాంటివి వద్దని ఆమెకు భర్త చాలా సార్లు చెప్పి చూశాడు. వినకపోగా మరోసారి అలాగే రీల్స్ చేస్తూ వచ్చింది. తట్టుకోలేకపోయిన భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కోల్ కతాలోని ఓ ప్రాంతంలో పరిమిళ బైద్య (38)-అపర్ణ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. భర్త స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య మాత్రం ఇంట్లోనే ఉండేది. ఇంట్లో ఉన్న ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాక అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉండేది. ఇలా చేయొద్దంటూ భర్త పరిమిళ బైద్య భార్యకు నచ్చజెప్పాడు. అయితే, భర్త మాటలను అపర్ణ ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు. ఇటీవల ఆ మహిళ మరోసారి రీల్స్ చేసింది. మరో విషయం ఏంటంటే అపర్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో చాట్ చేస్తున్నట్లు భర్త అనుమనించాడు.

ఇక ఇదే విషయంపై ఈ దంపతులు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన భర్త పరిమిళ బైద్య.. భార్యపై దాడికి దిగాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అపర్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య చనిపోయిందని తెలుసుకుని పరిమిళ బైద్య ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పరారీలో ఉన్న పరిమిళ బైద్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రీల్స్ చేస్తుందని భార్యను హత్య చేసిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet