iDreamPost
android-app
ios-app

వీడు తండ్రి కాదు, రాక్షసుడు! కన్న పిల్లలని చూడకుండా!

  • Published Jul 11, 2023 | 4:58 PM Updated Updated Jul 11, 2023 | 4:58 PM
  • Published Jul 11, 2023 | 4:58 PMUpdated Jul 11, 2023 | 4:58 PM
వీడు తండ్రి కాదు, రాక్షసుడు! కన్న పిల్లలని చూడకుండా!

పిల్లలకు చిన్న గాయమైతేనే ఏ తండ్రైనా తల్లిడిల్లిపోతుంటారు. చిన్నప్పటి నుంచి పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. కానీ, ఓ తండ్రి మాత్రం ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. కసాయిగా మారి కిరాతకానికి ఒడిగట్టాడు. కన్న పిల్లలు అని కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగందనే పూర్తి వివరాలు మీ కోసం.

అది ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామం. ఇక్కడే పార్శపు శివరామగోపాల్-మూర్తమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ దంపతులిద్దరూ సంతోషంగానే గడిపారు. ఇదిలా ఉంటే.. శివరామగోపాల్ ఓ దొంగతనం కేసులో గత కొంత కాలం పాటు జైలు శిక్షఅనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. ఇక వచ్చిన నాటి నుంచి భార్య మూర్తమ్మతో గొడవ పడుతూనే ఉన్నాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. భర్త పోరును భరించలేని మూర్తమ్మ.. రెండు రోజుల కిందట అదే ఊరిలో ఉన్న తన పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే.. వీరిద్దరి పిల్లలు స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో చదువుకుంటున్నారు. కాగా, శివరామగోపాల్ సోమవారం సాయంత్రం స్కూల్ లో ఉన్న తన పిల్లలను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఈ దుర్మార్గుపు తండ్రి కసాయిలా మారి తన ఇద్దరు పిల్లలను గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తర్వాత వారి మృతదేహాలను దుప్పట్లో మూట గట్టి ఇంట్లో వదిలి పరారయ్యాడు. ఇక సాయంత్రం పిల్లలు కనిపించకపోవడంతో మూర్తమ్మ తన ఇంటికి వచ్చి చూసింది. కానీ, ఇంటికి తాళం వేసి కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ.. స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇద్దరు పిల్లలు దుప్పట్లో విగత జీవులుగా పడి ఉన్నారు.

పిల్లలను అలా చూసి ఆ తల్లి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చింది. స్థానికులు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మూర్తమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శివరామగోపాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భార్యపై కోపంతో ఈ దుర్మార్గపు తండ్రి తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన ఈ ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఇంటి యజమానురాలిపై కన్నేసిన డ్రైవర్! ఎవరూ లేని టైమ్ చూసి..!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş