iDreamPost
android-app
ios-app

ప్రియుడి బరితెగింపు.. ప్రియురాలు ఆస్పత్రిలో ఉండగా..!

  • Published Jul 17, 2023 | 9:40 PM Updated Updated Jul 17, 2023 | 9:40 PM
  • Published Jul 17, 2023 | 9:40 PMUpdated Jul 17, 2023 | 9:40 PM
ప్రియుడి బరితెగింపు.. ప్రియురాలు ఆస్పత్రిలో ఉండగా..!

ఈ రోజుల్లో యువతి, యవకులు ఎంత తొందరగా లవ్ లో పడుతున్నారో అంతే తొందరగా బ్రేకప్ చేప్పుకుంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే అని చెప్పాలి. ఇక ప్రతీ దానికి గొడవ పడడం, తిట్టుకోవడం, భావాలు నచ్చకపోతే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఇలాగే ప్రియురాలితో గొడవ పడ్డ ఓ ప్రేమికుడు బరితెగించి ప్రవర్తించాడు. ఆస్పత్రిలో అందరి ముందే చూస్తుండగానే దారుణానికి ఒడిగట్టాడు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం… కేరళ ఎర్నాకులం జిల్లాలోని తిరువనంతపురం ప్రాంతం. ఇక్కడే మహేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉన్న లిజీ అనే యువతిని ప్రేమించాడు. ఈమె కూడా అతడిని ప్రేమించినట్లు తెలుస్తుంది. అలా వీరి ప్రేమాయణం గత కొంత కాలంగా కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. లిజీ తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆమె అక్కడే చికిత్స పొందుతుండగా లిజీ తల్లికి తోడుగా ఆస్పత్రిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే శనివారం లిజీ ప్రియుడు మహేష్ అదే ఆస్పత్రికి వచ్చి ప్రియురాలితో మాట్లాడాడు. ఇదే సమయంలోనే ఇద్దరు గొడవ పడ్డారు.

ఇక క్షణికావేశంలో ఊగిపోయిన మహేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలు లిజీని దారుణంగా పొడిచాడు. ఇతని దాడిలో ఆ యువతి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో మహేష్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా ఆస్పత్రికి సెక్యురిటీ ఆ నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: మహిళా అధికారి గలీజ్ దందా.. ఆఫీసులో ఇదేం పని మేడం?

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet