iDreamPost
android-app
ios-app

ఓ అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు హోటల్‌కి వెళ్లి అలాంటి స్థితిలో!

వారిద్దరూ ఆయుర్వేద వైద్యులు. మరో స్నేహితురాలు కలిసి సరదాగా గడుపుదామని అరుణా చల్ ప్రదేశ్ వెళ్లారు. ఈటానగర్ లో ఓ రూం తీసుకుని ఉన్నారు. రెండు రోజుల నుండి ఆ గది నుండి బయటకు రావడం లేదు.

వారిద్దరూ ఆయుర్వేద వైద్యులు. మరో స్నేహితురాలు కలిసి సరదాగా గడుపుదామని అరుణా చల్ ప్రదేశ్ వెళ్లారు. ఈటానగర్ లో ఓ రూం తీసుకుని ఉన్నారు. రెండు రోజుల నుండి ఆ గది నుండి బయటకు రావడం లేదు.

ఓ అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు హోటల్‌కి వెళ్లి అలాంటి స్థితిలో!

ఉన్నత చదువులు చదివినా అంధ, మూఢ విశ్వాసాలు మనుషుల్ని బలహీనుల్ని చేసేస్తున్నాయి. శాస్త్ర, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. మనిషి మాత్రం ఇంకా ఆ దిశగా ఎదగడం లేదు. చదువును తీసుకెళ్లి కుప్ప తొట్టిలో పోసి.. అజ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వీరు బతుకుతున్నదే కాకుండా ఇతరులపై కూడా రుద్ది జీవనం సాగిస్తున్నారు. దెయ్యాలు, భూతాలు ఉన్నాయని విశ్వసిస్తూ వాటి గురించే చర్చిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. తమకు అభూత కల్పనలు ఉన్నాయని, తాము దైవాంశ సంభూతలమంటూ మానసిక అపరిపక్వతలో మునిగి తేలుతున్నారు. ఇదే సమయంలో దేవుని దర్శనం కోసం అర్పణ పేరుతో తమను తాము బలితీసుకుంటున్నారు కూడా.

అరుణా చల్ ప్రదేశ్ టూర్ వెళ్లిన మలయాళీ దంపతులతో పాటు మరో మహిళ ఓ హోటల్ గదిని తీసుకున్నారు. ఆ గది నుండి ఆ ముగ్గురు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి చూడగా.. ముగ్గురు మృతదేహాలు కనిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారిని కేరళకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు నవీన్ థామస్, ఆయన భార్య దేవి, వారి స్నేహితురాలు ఆర్యగా కనుగొన్నారు. ఇద్దరు వ్యక్తులను చంపి.. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. కాగా, నవీన్ శరీరంపై ఉన్న మచ్చలు మూడ నమ్మకాలను సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

కొట్టాయం ప్రాంతానికి చెందిన నవీన్, దేవి తాము భార్యా భర్తలమని, ఆర్య తమ కూతురని పేర్కొటూ ఈటానగర్‌లో హోటల్ రూం బుక్ చేసుకున్నారు. అంతలో ఆర్య కనిపించకుండా పోయిందన్న ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు, కొట్టాయం దంపతులతో కలిసి విమానం ఎక్కినట్లు గుర్తించారు. స్థానికులు చెబుతున్న ప్రకారం.. ఈ జంట చేతబడులను నమ్మేవారని చెబుతున్నారు. నవీన్, అతని భార్య ఆయుర్వేద వైద్యులు. వీరికి వివాహమై 13 ఏళ్లు అవుతుంది. నవీన్ ప్రాక్టీస్ మానేసి.. కేక్ బిజినెస్ ప్రారంభించాడు. ఇంతలో మూడ నమ్మకాలకు అతడు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయేవాడు. చివరకు సెలవులపై అరుణాచల్ వెళుతున్నామని చెప్పిన భార్యా భర్తలు.. ఇలా శవాలై కనిపించే సరికి కన్నీరు మున్నీరు అవుతున్నారు పేరెంట్స్.

కాగా, ఆర్య వీరి ఇద్దరి కన్నా చాలా చిన్నది. ఆమె ఓ ఉపాధ్యాయురాలు. ఆమె కూడా వీరి గదిలోనే చనిపోయి కనిపించింది. పోలీసులు చెబుతున్న వివరాలు మరోలా ఉన్నాయి. మృతురాలు దేవీ, ఆర్యల మధ్య విడదీయరాని బంధం ఉందని చెబుతున్నారు. దేవీ, ఆర్య కలిసి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసే సమయంలో మిత్రులయ్యారు. దేవి జర్మన్ నేర్పించగా.. ఆర్య ఫ్రెంచ్ చెప్పేది. అలా వారి స్నేహం.. మరింత బలపడింది. ఇదే క్రమంలో ఆర్యకు వివాహం ఫిక్స్ చేశారు తల్లిదండ్రులు. అంతలో విహార యాత్రకు వెళుతున్నానని చెప్పి.. ముగ్గరు అరుణా చల్ ప్రదేశ్ వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు  చేసి మరింత విచారణ జరుపుతున్నారు.  ఈ మిస్టరీ మరణాల వెనుక అసలు కారణాలు తెలియరాలేదు.