iDreamPost
android-app
ios-app

నర్సు వేషంతో మహిళ కన్నింగ్ ప్లాన్! ఏం చేసిందో తెలిస్తే అస్సలు నమ్మలేరు!

నర్సు వేషంతో మహిళ కన్నింగ్ ప్లాన్! ఏం చేసిందో తెలిస్తే అస్సలు నమ్మలేరు!

పైన ఫొటోలో నర్సులా కనిపిస్తున్న ఈ మహిళ పేరు అనూష. వయసు 25 ఏళ్లు. ఆమెకు గతంలో అరుణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. అలా వీళ్లు గత కొన్నేళ్ల నుంచి కాస్త సన్నిహితంగా మెలిగారు. చివరికి అనూష స్నేహితుడు అరుణ్ పై మనసు పారేసుకుంది. పెళ్లంటూ చేసుకుంటే ఇతడినే చేసుకోవాలని గట్టిగా అనుకుంది. ఇక ఇంకేముంది ఆ దిశగా ఎవరూ ఊహించని ప్రయత్నం చేసింది. మరో విషయం ఏంటంటే? అనూష స్నేహితుడైన.. కాదు కాదు, ఆమె ప్రియుడైన అరుణ్ కు ఇంతకు ముందే పెళ్లై ఇటీవల ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఇంతకు అరుణ్ ను పెళ్లి చేసుకోవడానికి అనూష వేసిన ప్లాన్ ఏంటి? ఇంతకు పెళ్లి జరిగిందా? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కేరళలోని అలప్పజాలో అనూష (25) అనే యువతి నివాసం ఉంటుంది. ఈమెకు గతంలో అరుణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే అనూష అతనిపై మనసు పారేసుకుంది. అలా కొంత కాలం పాటు వీరి ప్రేమాయణం కొనసాగినట్లు తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే? అరుణ్ కు గతంలో స్నేహ అనే యువతితో వివాహం జరిగింది. అయినా సరే అనూష ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ, ప్రియుడికి ముందే పెళ్లైంది. దీంతో ఆమెకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే అనూష ఓ కన్నింగ్ ప్లాన్ గీసుకుంది.

అదేంటంటే? ఇటీవల అరుణ్ భార్య స్నేహ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే మంచి సమయం అనుకున్న అనూష.. ఎలాగైనా అరుణ్ భార్యను హత్య చేసి ఆ తర్వాత ప్రియుడితో హాయిగా ఉండాలని అనుకుంది. ఇందులో భాగంగానే అనూష నర్సుగా వేషం వేసి ఆస్పత్రిలో ఉన్న స్నేహ బెడ్ వద్దకు వెళ్లింది. మనిషి రక్తనాళంలోకి గాలి చేరితే చనిపోతారని తెలుసుకున్న అనూష.. ఎవరూ లేని టైమ్ లో సిరంజితో స్నేహకు గాలిని ఇంజెక్ట్ చేసింది. అనూష ప్రవర్తనపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానమొచ్చి వెంటనే ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు.

హుటాహుటిన అక్కడికి చేరుకున్న వైద్యులు స్నేహకు చికిత్స అందించారు. దీంతో ఆ మహిళ ప్రాణాల నుంచి బయటపడింది. కాగా, ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి అనూషను అప్పగించారు. పోలీసులు అమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపెట్టింది. నేను అరుణ్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, ఇందుకోసమే అతని భార్యను చంపాలని చూశానంటూ పోలీసులకు వివరించింది. ఆమె చెప్పిన నిజాలతో బాధితురాలి భర్త అయిన అరుణ్ ను సైతం పోలీసులు విచారించనున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్: మహిళకు రూ.10 లక్షల ఆఫర్ ఇచ్చిన యువకుడు! ఎందుకో తెలుసా?

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet