iDreamPost
android-app
ios-app

కావలి ఆర్టీసీ డ్రైవర్‌ ఘటన.. దాడి చేసింది టీడీపీ రౌడీలే: MLA రామిరెడ్డి ప్రతాప్‌

  • Published Oct 30, 2023 | 1:41 PM Updated Updated Oct 30, 2023 | 1:41 PM

నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ మీద దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌.. దీనికి సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ మీద దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌.. దీనికి సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

  • Published Oct 30, 2023 | 1:41 PMUpdated Oct 30, 2023 | 1:41 PM
కావలి ఆర్టీసీ డ్రైవర్‌ ఘటన.. దాడి చేసింది టీడీపీ రౌడీలే: MLA రామిరెడ్డి ప్రతాప్‌

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ మీద దాడి చేసిన సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు.. ట్రంకురోడ్డులో బైక్‌ అడ్డు వచ్చింది. దాన్ని పక్కకు తొలగించాలంటూ డ్రైవర్‌ హారన్‌ కొట్టాడు. దాంతో వివాదం మొదలయ్యింది. అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. కానీ బైక్‌ యజమాని ఆ విషయాన్ని అంతటితో వదిలేయక.. తన స్నేహితులకు చెప్పాడు. దాంతో మొత్తం 14 మంది కలిసి ఆర్టీసీ బస్సును వెంబడించి.. బస్సును అడ్డగించారు. డ్రైవర్‌ను కిందకు దింపి.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.. సంచలన వీడియో విడుదల చేశారు. కావలి ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన రౌడీలంతా టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన వారే అని స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్‌ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నారని.. అంతేకాక నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక ఆధారాలతో సహా రౌడీ మూకల ఫో­టోలను మీడియాకు ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ మీద విమర్శలు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా.. దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్క­రున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్‌ అందుకు సిద్ధమేనా అని ఎమ్మెల్యే రామిరెడ్డి సవాల్‌ చేశారు.

ఈ కేసులో ప్రధాన ముద్దాయి సుధీర్‌ గతంలో తన కారుపై కూడా దాడి చేసిన­ట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్‌ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్‌ కుమార్‌ ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాక అరుణ్‌ కుమార్‌ ఐ సపోర్ట్‌ బాబు అనే బ్యానర్‌ పట్టుకున్నాడని చెప్పుకొచ్చారు. అంతేకాక శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్‌ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.