iDreamPost
android-app
ios-app

శిల్ప అనుమానాస్పద మృతి.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి!

  • Published Sep 23, 2023 | 1:09 PM Updated Updated Sep 23, 2023 | 1:09 PM
  • Published Sep 23, 2023 | 1:09 PMUpdated Sep 23, 2023 | 1:09 PM
శిల్ప అనుమానాస్పద మృతి.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి!

కర్ణాటకలోని జవహర్ నగర్ లో శిల్ప అనే వివాహిత మంగళవారం అనుమానాస్పద స్థితిలో బిల్డింగ్ పై నుంచి పడి మరణించిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. శిల్ప మరణంపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం శిల్ప మరణంపై ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఇల్లూరు గోపాలయ్య తాజాగా స్పందించి పలు ఆరోపణలు లేవనెత్తాడు.

కర్ణాటకలోని జవహర్ నగర్ కు చెందిన శరత్ కు మా కూతురిని ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాం. పెళ్లిలో భాగంగా మా అల్లుడికి రూ.25 లక్షల కట్నంతో పాటు 25 తులాల బంగారం కూడా ముట్టజెప్పాం. ఇక పెళ్లి అనంతరం రెండు నెలల పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ, ఆ తర్వాత శిల్పను అత్తింటి వాళ్లు మానసికంగా అనేక రకాలు ఇబ్బందులకు గురి చేశారు. ఈ క్రమంలోనే మేము పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి సర్దిచెప్పే ప్రయత్నం చేశాం.

ఇంతే కాకుండా శిల్ప భర్త, అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త అందరూ శిల్పను మరింత కట్నం తేవాలని వేధింపులకు గురి చేశారు. దీంతో మా కూతురు ఫోన్ సోమవరం ఫోన్ చేసి నేను పుట్టింటికి వస్తానని ఏడుస్తూ చెప్పింది. ఇక మరుసటి రోజే మా కూతురుని హత్య చేసి.. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని శిల్ప తండ్రి ఆరోపించాడు. ఆమె ఒంటిపై చాలా గాయాలున్నాయని, మాకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని మృతురాలి తల్లిదండ్రులు కోరారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkazan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş