iDreamPost
android-app
ios-app

పెళ్లై ఏడాదే.. అంతలోనే దారుణం.. రాత్రికి రాత్రే

  • Published Sep 21, 2023 | 3:03 PM Updated Updated Sep 21, 2023 | 3:03 PM
  • Published Sep 21, 2023 | 3:03 PMUpdated Sep 21, 2023 | 3:03 PM
పెళ్లై ఏడాదే.. అంతలోనే దారుణం.. రాత్రికి రాత్రే

నేటి ఆడ పిల్లలకు పెళ్లిళ్ల విషయంలో కొన్ని అంచనాలు ఉన్నాయి. తనకు కాబోయే వరుడు ఇలా ఉండాలని, తనను అర్థం చేసుకోవాలని, ఇంత సంపాదన పరుడై ఉండాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా బాగా, చదువుకుని, ఆర్థికంగా బలపడటంతో పాటు తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. దీంతో తమ పెళ్లిళ్ల విషయంలో నిర్ణయాలు వారివే ఫైనల్ అవుతున్నాయి. వీరిని కాదని తల్లిదండ్రులు కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలని కంగారు పెట్టడం లేదు. ఆడపిల్లలు మానసికంగా, ఆర్థికంగా ఎదిగినప్పటికీ.. అత్తారింట్లో ఆగచాట్ల నుండి, వారి వేధింపుల నుండి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. భార్యా భర్తల మధ్య ఏర్పడిన గొడవలు.. అఘాయిత్యాలకు కారణమౌతున్నాయి.

పెళ్లై ఏడాది గడిచిందో ఏమో.. ఆమె మనస్సులో ఏం బాధ కలిగిందో తెలియదు కానీ.. మేడ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన కర్ణాటకలోని జవహర్ నగర్‌లో చోటుచేసుకుంది. అయితే తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదని హత్య అని చెబుతున్నారు. శరత్, శిల్పకు గత ఏడాది వివాహం జరిగింది. అప్పటి నుండి ఆమెను అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే శిల్ప అనుమానాస్పద రీతిలో చనిపోయింది. భర్త, అతడి కుటుంబ సభ్యులు పరారవ్వడంతో ఆ అనుమానం మరింత బలపడింది. ఆమెను భర్త శరత్, అత్త శశికళ, మామ సురేష్ హత్య చేశారని శిల్ప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş