iDreamPost
android-app
ios-app

చెల్లితో చేతులు కలిపి భర్తను చంపింది. కానీ, ఆ ఒక్క సీన్ తో అంతా రివర్స్!

ఈ రోజుల్లో కొందరు దంపతులు పెళ్లైన కొంత కాలానికి ప్రతీ చిన్న విషయానికి గొడవలు పడుతున్నారు. మాట్లాడుకుంటే పోయే ఈ గొడవలకు.. పరిష్కారమే లేదన్నట్లుగా హత్యలు లేదా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది.

ఈ రోజుల్లో కొందరు దంపతులు పెళ్లైన కొంత కాలానికి ప్రతీ చిన్న విషయానికి గొడవలు పడుతున్నారు. మాట్లాడుకుంటే పోయే ఈ గొడవలకు.. పరిష్కారమే లేదన్నట్లుగా హత్యలు లేదా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది.

చెల్లితో చేతులు కలిపి భర్తను చంపింది. కానీ, ఆ ఒక్క సీన్ తో అంతా రివర్స్!

ఈ రోజుల్లో కొందరు దంపతులు పెళ్లైన కొంత కాలానికి ప్రతీ చిన్న విషయానికి గొడవలు పడుతున్నారు. మాట్లాడుకుంటే పోయే ఈ గొడవలకు.. పరిష్కారమే లేదన్నట్లుగా హత్యలు లేదా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. ఓ మహిళ తన చెల్లితో చేతులు కలిపి కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత తనకేం తెలియదన్నట్లుగా భర్త శవాన్ని పూడ్చి పెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. బనశంకరి పరిధిలోని సంపిగేహళ్లిలో షకీల్ అక్తర్ సైఫీ, నజీర్ ఖాతూన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇక్కడే ఏదో పని చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉంటే.. భర్త గత కొంత కాలం నుంచి భార్యను వేధిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతని భార్య నజీర్ ఖాతూన్.. ఎలాగైన మొగుడిని చంపాలని అనుకుంది. ఇందులో భాగంగానే తన చెల్లితో కలిసి భర్త హత్యకు పథకం రచించింది.

ఆ మహిళ ఈ నెల 9న భర్త నిద్రలో ఉండగా ముఖంపై దిండు ఉంచి ఊపరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని దగ్గరలోని ఓ లే అవుట్ లో పాతి పెట్టింది. ఇక మరుసటి రోజు షకీల్ అక్తర్ సైఫీ కనిపించలేదు. దీంతో అతని సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ నెల 14న ఓ వ్యక్తి లే అవుట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా విపరీతమైన దుర్వాసన వచ్చింది. అనుమానం రావడంతో కాస్త తవ్వి చూడగా.. ఓ మనిషి శవం కనిపించింది. ఈ సీన్ చూసి అతడు ఒక్కసారిగా షాక్ గురయాడు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి శవాన్ని బయటకు తీసి పరిశీలించగా.. కనిపించకుండాపోయిన షకీల్ అక్తర్ సైఫీ అని గుర్తించారు. ఆ తర్వాత మృతుడి భార్యను అన్ని కోణాల్లో విచారించగా.. నా భర్త తరుచు వేధించేవాడని, అందుకే నా చెల్లితో కలిసి నేనే చంపానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితురాలైన నజీర్ ఖాతూన్ తో పాటు ఆమె చెల్లిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibomgrandpashabet