iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ, డబ్బుకు ఆశపడి భార్య అని చూడకుండా..!

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త డబ్బు కోసం ఆశపడి కట్టుకున్న భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఇలాంటి కిరాతకం మీరెక్కడా చూసుండరు. అసలేం జరిగిందంటే?

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త డబ్బు కోసం ఆశపడి కట్టుకున్న భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఇలాంటి కిరాతకం మీరెక్కడా చూసుండరు. అసలేం జరిగిందంటే?

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ, డబ్బుకు ఆశపడి భార్య అని చూడకుండా..!

పైన కనిపిస్తున్న వీళ్లిద్దరు భార్యాభర్తలు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగింది. మంచి అల్లుడు దొరికాడని యువతి తల్లిదండ్రులు కూడా మురిపోయారు. కానీ, రాను రాను ఈ మహిళ భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. డబ్బు కోసం ఆశపడి ఏకంగా కట్టుకున్న భార్య అని చూడకుండా ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. అయితే, ఇతడు చేసిన పనికి మహిళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. సంచలనంగా మారిన ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కొలారులోని మిల్లత్ నగరం ప్రాంతం. ఇక్కడే మహేనూర్ (22) అనే యువతి నివాసం ఉండేది. ఇదే ప్రాంతంలో సయ్యద్ షుహైబ్ అనే యువకుడు కూడా నివాసం ఉండేవాడు. అయితే, కొన్నాళ్ల కిందట వీరికి పరిచయం ఏర్పడింది. దీంతో అప్పుడప్పుడు ఇద్దరు మాట్లాడుకునేవారు. అలా వీరి స్నేహం చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే 2 ఏళ్ల కిందట ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లైన ఏడాది పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగింది.

భర్త ఓ చోట పని చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే.. రాను రాను షుహైబ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెళ్లిలో నాకు కట్నం ఇవ్వలేదని, మీ పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని వేధించినట్లు సమాచారం. ఇక రాను రాను అతని టార్చర్ మరింత ఎక్కువైంది. ఇదే విషయంపై ఈ దంపతులు తరుచు గొడవ పడేవారు. ఇటీవల కూడా ఈ భార్యాభర్తలు మరోసారి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మహేనూర్ ఉన్నట్టుండి ఇంట్లో శవమై కనిపించింది. ఈ విషయం మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళను అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు.

అనంతరం ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి భర్త గత కొంత కాలం నుంచి అదనపు కట్నం తేవాలని వేధించేవాడని, తీసుకు రానందుకే ఆమె భర్త సయ్యద్ షుహైబ్ గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకంగా మారుతోంది. కట్నం కోసం కట్టుకున్న భార్య అని కూడా కిరాతకంగా హత్య చేసిన షుహైబ్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis