iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ గా సేవలు.. అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూనే..!

ఈ అమ్మాయి పేరు సిందూజ. ఈమె కొన్ని రోజుల నుంచి ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల ఊహించని ఘటనతో అంతా షాక్ కు గురయ్యారు. అసలేం జరిగిందంటే?

ఈ అమ్మాయి పేరు సిందూజ. ఈమె కొన్ని రోజుల నుంచి ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల ఊహించని ఘటనతో అంతా షాక్ కు గురయ్యారు. అసలేం జరిగిందంటే?

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ గా సేవలు.. అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూనే..!

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు సింధూజ, వయస్సు 28 ఏళ్లు. చిన్నప్పటి నుంచి చదువుల్లోనే కాకుండా అన్నిట్లో చాలా చురుగ్గా ఉండేది. ఇక ఆమెకు పెద్ద అయ్యాక డాక్టర్ కావాలనే కల ఉండేది. దీనికి కోసం బాగా కష్టపడి చదవింది. అదే సంకల్పంతో బాగా చదివి ఎట్టకేలకు ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ గా ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత రోజూ ఆస్పత్రికి వెళ్తూ ఉండేవారు. ఇక దగ్గర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ అమ్మాయి చాలా రోజుల నుంచి అక్కడే ఒంటరిగా ఉండేది. అయితే ఇటీవల ఓ రోజు ఈ అమ్మాయి డ్యూటీకి డుమ్మా కొట్టింది. ఎందుకు రాలేదని తోటి వైద్యులు ఆమెకు చాలా సార్లు ఫోన్ చేశారు. కానీ, ఎంతకు కూడా ఆ యువతి స్పందించలేదు. ఇక చేసేదేం లేక అంతా కలిసి రూమ్ కు వెళ్లి చూడగా ఆమె ఊహించని స్థితిలో కనిపించింది. ఈ సీన్ చూసి వాళ్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంతకు సిందూజకు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకి చెందిన సిందూజ (28) చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణించేంది. బాగా చదివి ఎప్పటికైన డాక్టర్ కావాలని అనుకుంది. ఇక అనుకున్నట్లే ఆ అమ్మాయి కష్టపడి చదివి వైద్యురాలిగా ఉద్యోగం సాధించింది. ఇక కర్ణాటకలోని కొల్లెగ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె వైద్యురాలిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈమె స్థానికంగా ఉన్న ఓ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఆస్పత్రికి వెళ్లేది. అలా రోజూ డ్యూటీకి వెళ్తూ అందరితో కలిసి మెలిసి సంతోషంగా ఉండేది. అయితే, ఏం జరిగిందో తెలియద కానీ.. ఇటీవల ఓ రోజు సిందూజ డ్యూటీకి డుమ్మా కొట్టింది. ఆమె తోటి వైద్యులు అనేక సార్లు ఫోన్ చేశారు. ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వెంటనే వాళ్లు సిందూజ ఉంటున్న గదికి వెళ్లారు.

ఇక తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఆ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించింది. ఆ యువతిని అలా చూసి అందరూ షాక్ కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ అంతా పరిశీలించారు. ఈ క్రమంలోనే వారికి సిందూజ మృతదేహం పక్కన ఓ సిరంజి దొరికింది. ఆ తర్వాత పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇకపోతే, సిందూజ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానింకగా తీవ్ర విషాదంగా మారింది. అద్దె ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సిందూజ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి