iDreamPost
android-app
ios-app

వీడియో: అది పట్టపగలు, రోడ్డుపై ఒంటరిగా యువతి.. ఎంతకు తెగించాడంటే?

వీడియో: అది పట్టపగలు, రోడ్డుపై ఒంటరిగా యువతి.. ఎంతకు తెగించాడంటే?

అది మిట్ట మధ్యాహ్నం, రోడ్డుపై ఒంటరిగా ఓ అందమైన యువతి అలా నడుచుకుంటూ వెళ్తుంది. వెనకాల నుంచి ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన పని తాను చూసుకుంటాడేలే మనకెందుకు అని ఆ యువతి వదిలేసింది. కానీ, అతడు పరుగెత్తుకుంటూ వచ్చింది మాత్రం ఆ యువతి కోసమే. ఇక ఆ యువకుడు వస్తు వస్తూనే ఆ యువతిని వెనకాల నుంచి గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఆ యువతికి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టినంత పనైంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని యువకుడు ఏం చేశాడో తెలియాలంటే ఈ ఫుల్ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

అది కర్ణాటక బెలగావి పరిధిలోని హింద్వాడీ. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ట్యూషన్ కోసమని ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆ యువతిని ఓ యువకుడు గమనించాడు. మెల్లగా ఆమెను ఫాలో అయ్యాడు. ఎలాగైనా సరే ఆ యువతిని కిడ్నాప్ చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే అటు ఇటు అంతా చూశాడు. ఆ సమయంలో ఒక్క మనిషి పురుగు కూడా కనిపించలేదు. ఇదే మంచి సమయం అనుకున్న ఈ దుర్మార్గుడు.. వెంటనే ఆ యువతి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఆ యువతి వద్దకు చేరుకుని గట్టిగా పట్టుకుని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక ఆ యువతికి వెన్నులో వణుకు పుట్టినంత పనైంది. దీంతో అతడి నుంచి బయటపడేందుకు ఆ యువతి గట్టిగా అరిచింది. ఆ యువతి శబ్ధం విన్న స్థానికులు అంతా వెంటనే బయటకు వచ్చారు. వారిని గమనించిన ఆ యువకుడు ఆ యువతిని అక్కడే విడిచి పెట్టి పరారయ్యాడు. ఇదంతా అక్కడున్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై స్పందించిన ఆ యువతి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నాడు.. కానీ, ఆ ఒక్క పొరపాటే..!