iDreamPost

మహిళ ప్రాణాలు తీసిన చున్నీ..

మహిళ ప్రాణాలు తీసిన చున్నీ..

ఈ మధ​ కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. తప్పు లేకపోయినా అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, చున్నీ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. బైక్‌ వెళుతూ ఉండగా.. ఆమె చున్నీ బైక్‌ చక్రంలో ఇరుక్కుని ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ మండలం నగురం గ్రామానికి చెందిన జగన్‌ రావు, పూజిత భార్యాభర్తలు. వీరికి నిత్యశ్రీ, అజేశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇద్దరు పిల్లలకు జ్వరం రావటంతో దంపతులు సెప్టెంబర్‌ 18న ఆస్పత్రికి బయలు దేరారు. అందరూ బైకు మీద ఆస్పత్రికి వెళుతూ ఉన్నారు. అయితే, విధి అనుకోని విధంగా ఆమె జీవితంతో ఆడుకుంది. బైకు రన్నింగ్‌లో ఉండగా పూజిత చున్నీ బైక్‌ చక్రంలో ఇరుక్కుంది. దీంతో పూజిత బైక్‌ పైనుంచి కిందపడిపోయింది. తల బలంగా రోడ్డుకు తాకటంతో పెద్ద గాయం అయింది. ఈ నేపథ్యంలో ఆమెను చికిత్స కోసం హుటాహుటిన జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆ‍స్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ పూజిత మృతి చెందింది. అయితే, అల్లుడు అతి వేగంగా బైక్‌ నడపటం వల్లే తమ కూతురు చనిపోయిందని పూజిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి