iDreamPost

అసలు వీడు మనిషేనా? ముగ్గురు బాలికలకు చాక్లెట్లు ఆశ చూపి..!

అసలు వీడు మనిషేనా? ముగ్గురు బాలికలకు చాక్లెట్లు ఆశ చూపి..!

చూడటానికి అమాయకంగా కనిపిస్తున్న ఇతగాడు వయసులో చాలా పెద్దోడే. దాదాపు 70 ఏళ్లున్న ఈ వృద్దుడు.. ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అభం, శుభం తెలియని చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి వారిని వశపరుచుకుంటాడు. ఆ తర్వాత వాళ్లని నమ్మించి ఎవరూ లేని టైమ్ లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇంతకు ఈ వృద్ధుడు ఏం చేశాడో తెలుసా?

బాధిత కుటుంబాల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి పరిధిలోని రంగధామునిపల్లి గ్రామం. ఇక్కడే 67 ఏళ్ల వృద్దుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతని వయసు పెరిగినా ఇతని బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది. విషయం ఏంటంటే? స్థానికంగా స్కూల్ కు వెళ్లే బాలికలపై ఇతగాడు కన్నేశాడు. వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపి మెల్లగా వారిని మాటల్లోకి దించుతాడు. అభం, శుభం తెలియని ఆ చిన్నారులు అతని చెప్పింది నిజమే అనుకున్నారు. ఇక ఇంకేముంది.. ఆ వృద్దుడు వారిని నమ్మించి ఏకంగా ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది.

ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ బాలికల ఆరోగ్యంలో కాస్త తేడా రావడంతో వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించడంతో అసలు విషయం బయటపడింది. ఏం జరిగిందని చిన్నారులను పశ్నించగా వాళ్లు జరిగిందంతా పూస గుచ్చినట్లుగా వివరించారు. అనంతరం ఆ బాధిత పిల్లల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి