iDreamPost
android-app
ios-app

విషాదం: భార్య, పిల్లల్ని గన్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్! మరో దారుణం ఏంటంటే?

  • Published Oct 05, 2023 | 1:21 PM Updated Updated Oct 05, 2023 | 1:21 PM
  • Published Oct 05, 2023 | 1:21 PMUpdated Oct 05, 2023 | 1:21 PM
విషాదం: భార్య, పిల్లల్ని గన్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్! మరో దారుణం ఏంటంటే?

కడపలో దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భర్త భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఇంతే కాకుండా ఇతను మరో దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకుని ఇరువురి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు కానిస్టేబుల్ భర్త ఎందుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేశాడు? ఆ తర్వాత అతడు చేసిన మరో దారుణం ఏంటి? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కడపలోని కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు కడప రెండో పట్టణ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వస్తున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అప్పటి  నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ఈ దంపతుల సంసారం సంతోషంగానే కొనసాగించారు. ఇదిలా ఉంటే.. తాజాగా వెంకటేశ్వర్లు తుపాకీతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా కాల్చి చంపాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని ఇరువురి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నలుగురి మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం.. కుటుంబ కలహాల కారణంగానే వెంకటేశ్వర్లు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భార్యా, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వర్లు దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet