iDreamPost
android-app
ios-app

భార్యను హత్య చేసిన కసాయి భర్త! ఎందుకో తెలుసా?

  • Published Jul 31, 2023 | 7:28 PM Updated Updated Jul 31, 2023 | 7:28 PM
  • Published Jul 31, 2023 | 7:28 PMUpdated Jul 31, 2023 | 7:28 PM
భార్యను హత్య చేసిన కసాయి భర్త! ఎందుకో తెలుసా?

భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. కానీ, ఇంతదానికే కొందరు దంపతులు కొట్టుకుంటారు. ఇక ఇంతటితో ఆగకుండా చివరికి కత్తులకు పని చెప్పి చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి క్షణికావేశంలో తన భార్యను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఈ ఘటనపై స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఓడిపిలవంచ గ్రామంలో చిగుర గణేష్-చిగురు సంధ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి ఈ భార్యాభర్తలు ఉప్పు, నిప్పులా మారిపోయారు. ప్రతీ చిన్న దానికి గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గణేష్ మరోసారి భార్య సంధ్యతో గొడవపడ్డాడు. ఇది చినిగి చినిగి తీవ్ర రూపం దాల్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన గణేష్.. అదే రాత్రి భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

దీన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గణేష్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. క్షణికావేశంలో భార్యను కొట్టి చంపిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: రాధిక, బాలమణి మంచి స్నేహితులు.. ఆ తుంటరి యువకుడు చేసిన పనికి..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom