iDreamPost
android-app
ios-app

రాధిక, బాలమణి మంచి స్నేహితులు.. ఆ తుంటరి యువకుడు చేసిన పనికి..!

  • Published Jul 31, 2023 | 5:16 PM Updated Updated Jul 31, 2023 | 5:16 PM
  • Published Jul 31, 2023 | 5:16 PMUpdated Jul 31, 2023 | 5:16 PM
రాధిక, బాలమణి మంచి స్నేహితులు.. ఆ తుంటరి యువకుడు చేసిన పనికి..!

రాధిక, బాలమణి ఇద్దరు మంచి స్నేహితులు. రోజంతా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. ఇకపోతే, రోజూ తెల్లవారుజామున ఇద్దరు కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్తుంటారు. ఇక ఎప్పటిలాగే ఇటీవల ఆదివారం కూడా వెళ్లారు. అయితే, ఓ తుంటరి యువకుడు చేసిన పనికి ఊహించని ఘోరం చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఆ యవకుడు చేసిన పనేంటి? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కళాసిగూడ సాయి కాలనీకి చెందిన బాలమణి (60), బొల్లారం రిసాలబజార్ కు చెందిన రాధిక (48) ఇద్దరు మంచి స్నేహితులు. వీళ్లు గత కొన్నేళ్లుగా రోజూ ఉదయం పూట బొల్లారంలో ఉన్న కంటోన్మెంట్ పార్క్ కు మార్నింగ్ వాక్ కు వెళ్తుండేవారు. ఇక ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా ఇద్దరు కలిసి అక్కడికి మార్నింగ్ కు వాక్ కు వెళ్లారు. తిరిగి ముగించుకుని వచ్చే క్రమంలో ఓ తుంటరి యువకుడు స్పోర్ట్స్ బైక్ తో వేగంగా వచ్చి రాధిక, బాలమణిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడి చేతి విరగగా.. ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి మరణవార్త తెలుసుకుని వారిద్దరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఆ తుంటరి యువకుడు చేసిన పనికి అమాయక మహిళల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఇది కూడా చదవండి: మైనర్ అక్కాచెళ్లెల్లపై అఘాయిత్యం.. ఇద్దరూ గర్భం దాల్చడంతో..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom