ఏసీబీ అధికారులకు చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్

ఈ మధ్యకాలంలో కొందరు అధికారలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్నారు. తాజాగా జనగామ మున్సిపల్ కమిషనర్ కూడా దొరికిపోయారు.

ఈ మధ్యకాలంలో కొందరు అధికారలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్నారు. తాజాగా జనగామ మున్సిపల్ కమిషనర్ కూడా దొరికిపోయారు.

బాధ్యత గల వృత్తిలో ఉన్న కొందరు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మహిళా అధికారులు సైతం లేకపోలేదు. వీళ్లు చేస్తున్న అలాంటి పనులపై కొందరు స్పందించిన పై అధికారుకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా వారి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇలా ఎన్నో ఘటనల్లో కొందరు మహిళా అధికారులు ఏకంగా అలాంటి పనులు చేస్తూ ఏకంగా ఆఫీసుల్లోనే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. అచ్చం ఇలాగే ఓ మహిళా ఆఫీసర్ కార్యాలయంలోనే పాడు పనులకు తెర లేపుతూ అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో అధికారులు, ప్రజలు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కె. రజిత అనే మహిళా జనగామ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. చాలా కాలం నుంచి ఆమె ఇక్కడే పని చేస్తున్నారు. కానీ, ఉన్నట్టుండి ఈ మహిళా అధికారి చేసిన పనికి అందరూ షాక్ కు గురవుతున్నారు. ఇంతకు ఈ ఆఫీసర్ ఏం చేసిదంటే? జిల్లాలోని లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం గ్రామంలో రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు జనగామలో ఓ బిల్డింగ్ నిర్మించాలని అనుకున్నాడు. ఇందు కోసం అతడు తనకున్న స్థలంలో 10 శాతం స్థలాన్ని మున్సిపల్ ఆఫీసు పేరు మీద మార్టిగేజ్ చేశాడు.

అయితే ఆ భవనం నిర్మాణం పూర్తైన తర్వాత ఆ బిల్డింగ్ మార్టిగేజ్ రిలీజ్ కోసం, ఇంతే కాకండా దాన్ని రాజు పేరు మీద మార్చడానికి అతడు జనగామ జిల్లా మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న రజితను సంప్రదించాడు. పూర్తి విషయమంతా ఆమెకు వివరించాడు. కానీ, ఆమె తన విధిని తాను నిర్వర్తించకుండ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు. నా దగ్గర అంత డబ్బు లేదని రాజు చాలా సార్లు బతిమాలాడు. అయినా సరే.. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని రజిత చెప్పినట్లుగా సమాచారం. దీంతో రాజుకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

పథకం ప్రకారమే.. తాజాగా కె. రజిత ఆఫీసులో ఉండగా రాజు ఆమెకు డబ్బులు ఇవ్వబోయాడు. దీంతో ఆమె నా డ్రైవర్ నవీన్ కు ఇవ్వాలని సూచించింది. ఆమె చెప్పినట్లే రాజు ఆ మహిళా అధికారికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని ఆ మహిళా అధికారి డ్రైవర్, ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత దీనిపై ఇద్దరినీ విచారించారు. అనంతరం ఆ అధికారులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే, ఉన్నట్టుండి జనగామ జిల్లా మున్సిపల్ కమిషనర్ ఇలా లంచం తీసుకోవడంతో అందరూ షాక్ గురవుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈ మహిళా అధికారి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments