iDreamPost
android-app
ios-app

నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి! కట్ చేస్తే ఊహించని విషాదం!

  • Published Sep 22, 2023 | 1:09 PM Updated Updated Sep 22, 2023 | 1:09 PM
  • Published Sep 22, 2023 | 1:09 PMUpdated Sep 22, 2023 | 1:09 PM
నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి! కట్ చేస్తే ఊహించని విషాదం!

కులాలు వేరైనా ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే తల్లిదండ్రులను ఎదురించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది. ఇక కూతురి సంతోషాన్ని ఆమె తల్లిదండ్రులు కాదనలేక ఆమె ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. అలా పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ఉపాధి నిమిత్తం భర్త విదేశాలకు వెళ్లాడు. ఇక అంతా బాగానే ఉందనుకునే తరుణంలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాలోని కోరుట్లకు చెందిన దీప, తూలూరు గ్రామానికి చెందిన ప్రదీప్ గతంలో ప్రేమించుకున్నారు. ఇక ఇద్దరి కులాలు వేరు కావడంతో 4 ఏళ్ల కిందట పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. కోరుకున్న వాడితో కూతురు సంతోషంగా ఉండాలని భావించి ఈ మహిళ తల్లిదండ్రులు అల్లుడికి రూ. 10 లక్షలు కట్నం కింద ఇచ్చారు. ఇకపోతే.. ఉపాధి నిమిత్తం భర్త గతంలో గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భార్య మాత్రం కూతురితో పాటు అత్తమామల వద్దే ఉండేది.

అయితే ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి అత్తమామలు అదనపు కట్నం పేరుతో దీపను వేధించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని భర్తకు తెలియజేయడంతో అతడు కూడా భార్యను కట్నం పేరుతో టార్చర్ పెట్టినట్లు సమాచారం. కట్టుకున్న భర్త, అత్తమామలు కట్నం పేరుతో వేధించడంతో దీప తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఈ మహిళ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే దీప తల్లిదండ్రులకు, పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio