iDreamPost
android-app
ios-app

ఇద్దరు అబ్బాయిల లవ్.. కోటి రూపాయలు ఖర్చు! వింత లవ్ స్టోరీ!

  • Published Mar 06, 2024 | 5:24 PM Updated Updated Mar 06, 2024 | 5:24 PM

ఇద్దరు అబ్బాయిలు సోషల్ మీడియా ద్వాారా పరిచయం అయ్యారు. స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ప్రేమికులై.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు సమాజం ఒప్పుకోదని..

ఇద్దరు అబ్బాయిలు సోషల్ మీడియా ద్వాారా పరిచయం అయ్యారు. స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ప్రేమికులై.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు సమాజం ఒప్పుకోదని..

  • Published Mar 06, 2024 | 5:24 PMUpdated Mar 06, 2024 | 5:24 PM
ఇద్దరు అబ్బాయిల లవ్.. కోటి రూపాయలు ఖర్చు! వింత లవ్ స్టోరీ!

ఈ రోజుల్లో ప్రేమలు విచిత్రంగా తయారయ్యాయి. ఒక అమ్మాయి-అబ్బాయి ప్రేమించుకునే రోజుల నుండి.. ఒకే జెండర్ లవ్ చేసుకుని పెళ్లిళ్లు చేసుకునే దశకు చేరింది సమాజం. ఇటువంటి పెళ్లిళ్లకు ప్రస్తుతం చట్టబద్దత లేకపోయినా.. పెద్దలు అంగీకరించకపోయినా.. కొంత మంది తెగించి లేదా ధైర్యం చేసి.. తాము ఇష్టపడ్డ వ్యక్తిని మనువాడుతున్నారు. అవసరమైతే బిడ్డల్ని కూడా కంటున్నారు. దేశంలో పలు చోట్ల ఈ తరహా పెళ్లిళ్లను చూస్తూనే ఉన్నాం. అయితే సజావుగా సాగిపోతే పర్వాలేదు.. కానీ తేడా చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిందీ అమ్మాయి. ప్రియుడి కోసం పడరాని పాట్లు, చేయకూడని త్యాగం చేస్తే.. చివరకు అతడు హ్యాండ్ ఇచ్చాడు. ఆ కోపంతో అతడి కారును తగులపెట్టింది ప్రియురాలు. ఇంతకు ఏం జరిగిందంటే..

ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకున్నారు. పెళ్లికి రెడీ అయ్యారు. వీరిలో ఒకరు లింగ మార్పిడి చేసుకున్నారు. కోటీ రూపాయల ఖర్చు పెట్టి.. ఇదంతా చేస్తే.. ఇప్పుడు పెళ్లికి నో చెప్పాడు ప్రియుడు. దీంతో అతడి కారుకు నిప్పంటించింది ప్రియురాలు. వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన వైభవ్ శుక్లా, ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన దీప్ తన్వానియాకు 2021లో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 2022లో బృందాబన్‌లో కలుసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే సమాజం ఒప్పుకోదు కనుక.. లింగ మార్పిడి చేసుకోవాలని వైభవ్.. దీప్ పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో దీప్.. కోటి రూపాయల ఖర్చుతో బ్రెస్ట్, ఫేషియల్ సర్జరీలు చేయించుకున్నాడు. దీనికి కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యింది.

ఈ లింగ మార్పిడి తర్వాత.. దీప్ కాస్త.. దీపగా మార్చుకుంది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అంతలో దీపను మనువాడేందుకు నిరాకరించాడు వైభవ్. ఆపరేషన్ అయితే జరిగింది.. ఆమె గర్భవతి కాలేదని తెలియడంతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన దీప.. తన స్నేహితుడు రోహన్‌తో కలిసి కాన్పూర్‌కు బయలుదేరింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఇండోర్‌లో కేసు నమోదు చేయడంతో..ఇక్కడ కుదరదని చెప్పారు. కోపంతో వైభవ్ ఇంటికి వెళ్లారు దీప్, రోహన్. వైభవ్ తండ్రి అనూప్ కుమార్ శుక్లా కారు ఉండగా.. గ్యాసోలిన్‌తో తగుల పెట్టారు. మంటలు రావడంతో.. చుట్టు ప్రక్కల ప్రజలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం దీప్‌ను పట్టుకున్నారు పోలీసులు. కాగా, శుక్లాపై కంప్లైంట్ చేసింది బాధితురాలు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş