Uppula Naresh
Uppula Naresh
హైదరాబాద్ లోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో దారుణం వెలుగు చూసింది. ఓ అధికారి గత కొంత కాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్కూల్ లో ఉన్న విద్యార్థినులతో ఆయన గలీజ్ పనులకు తెర లేపుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాలికలను కారులో బయటకు తీసుకెళ్లి పాడు పనులకు తెర లేపాడనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇక ఇదే కాకుండా ఆ అధికారి ఇదే స్కూల్ లో ఉన్న ఓ మహిళా అధికారితో రాసలీలు కూడా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం స్పందించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఒక దినపత్రిక లో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు. బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని గౌరవ మంత్రి @VSrinivasGoud గారిని కోరుతున్నాను అంటూ కవిత ట్విట్ చేశారు.
దీంతో వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించి.. బాలికలను వేధింపులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఆ అధికారిని సస్పెండ్ చేశామని కూడా ఆయన తెలిపారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి స్పందిస్తూ.. మంచి పేరు వస్తున్న కారణంగా నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒక దినపత్రిక లో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు.
బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 13, 2023
ఇది కూడా చదవండి: సెల్ టవర్ ఎక్కి పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు