iDreamPost
android-app
ios-app

Hyderabad: BJP నేత హత్య కేసు.. వామ్మో ఈ తల్లికూతుళ్లు అసలు మనుషులేనా!

  • Published Feb 12, 2024 | 9:10 AM Updated Updated Feb 12, 2024 | 9:10 AM

యూసుఫ్‌గూడలో బీజేపీ నేత, రియల్టర్‌ దారుణ హత్య కేసులో ఇద్దరు తల్లీకూతూళ్లు ప్రధాన నిందుతులుగా ఉన్నారు. వారి నేర చరిత్ర చూసి పోలీసులు షాక్‌ అవుతున్నారు. ఆ వివరాలు..

యూసుఫ్‌గూడలో బీజేపీ నేత, రియల్టర్‌ దారుణ హత్య కేసులో ఇద్దరు తల్లీకూతూళ్లు ప్రధాన నిందుతులుగా ఉన్నారు. వారి నేర చరిత్ర చూసి పోలీసులు షాక్‌ అవుతున్నారు. ఆ వివరాలు..

  • Published Feb 12, 2024 | 9:10 AMUpdated Feb 12, 2024 | 9:10 AM
Hyderabad: BJP నేత హత్య కేసు.. వామ్మో ఈ తల్లికూతుళ్లు అసలు మనుషులేనా!

బీజేపీ నేత, రియల్టర్‌ సింగోటం రాము అనే వ్యక్తి యూసుఫ్‌గూడలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో వెలుగు చూస్తోన్న విషయాలు చూసి.. పోలీసులే విస్తుపోయారు. హనీట్రాప్‌, వివాహేతర సంబంధం రాము దారుణ హత్యకు కారణం అయ్యాయి. ఇక ఈ కేసులో ఇద్దరు తల్లీకూతుళ్లను ప్రధాన నిందుతులుగా తేల్చారు పోలీసులు. ఇక వారి నేర చరిత్ర చూసి.. అధికారులే అవాక్కయ్యారు. వామ్మో వీళ్లసలు మనుషులేనా.. ఆడవాళ్లు ఇంత దారుణంగా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. రామును ట్రాప్‌ చేయడం, హత్య చేసిన తీరు.. అంతా ఓ క్రైమ్‌ కథా చిత్రాన్ని తలపిస్తుంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ.. రౌడీషీటర్లతో కలిసి పక్కా ప్లాన్‌ చేసి.. రామును అంతమొందించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాము హత్య కేసులో ప్రధాన నిందుతులైన హిమాంబి, ఆమె కుమార్తె ప్రధాన నిందుతులు కాగా.. వారి నేర చరిత్ర చూసి ప్రతి ఒక్కరు షాక్‌ అవుతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ హిమాంబి, ఆమె కూతురు నసీమా.. ఇల్లీగల్‌ దందాకు సంబంధించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాక పలు పోలీస్‌స్టేషన్‌లలో తల్లి హిమాంబిపై 5 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. 2017, 2018లో కుమార్తె నసీమాతో పాటు ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడింది హిమాంబి.

ఆ తర్వాత 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్‌మెయిల్‌ చేసి 3 లక్షలు దోచుకున్నట్లు కేసు నమోదైంది. అంతేకాకుండా 2020లోనూ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం కేసులో హిమాంబిని అరెస్ట్ చేశారు పోలీసులు. అలానే 2019లో తన కూతురు నసీమాను కిడ్నాప్‌ చేశారంటూ రాజు అనే వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇక్కడ మరో దారుణమైన అంశం ఏంటి అంటే హిమాంబి.. తన కూతురుతోపాటు ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన హిమాంబి భర్తను వదిలేసి కుమార్తె నసీమాతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. యూసుఫ్‌గూడలో ఓ కానిస్టేబుల్‌ ఇంట్లో అద్దెకు దిగి.. అతడితోనే ప్రేమాయణం సాగించి చివరకు ఆ కానిస్టేబుల్‌ని బయటకు గెంటేయించారు తళ్లీకూతుళ్లిద్దరూ. అలా మొదలైన ఆమె వ్యభిచార దందా.. చివరకు కుమార్తెతో కలిసి బడాబాబులను హనీట్రాప్‌ చేయడం.. ఉన్నదంతా ఊడ్చేయడం.. ఆ తర్వాత వారిని నయానా భయానో బెదిరించి.. దూరంగా పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో ఈ తల్లీకూతుళ్లు సింగోటం రామన్న అలియాస్‌ పుట్టా రామును ట్రాప్ చేశారు. అతడి నుంచి కోట్ల రూపాయలు దండుకోవడమే కాక అతడిని అప్పుల పాలు చేసి.. అత్యంత దారుణంగా హత్య చేయించారు.

రాము.. హిమాంబి కూతురిపై కన్నైయ్యడంతో.. పక్కా ప్లాన్‌తో అతడిని అత్యంత కిరాతకంగా హత్య చేయించింది హిమాంబి. రాము హత్యలో రౌడీ షీటర్లు, రాము స్నేహితులు మణికంఠ, వినోద్ పాల్గొన్నారు. వినోద్‌కు హిమాంబి కూతురు నసీమాతో పరిచయం ఏర్పడింది. రాము వేధిస్తున్న విషయం ప్రియుడు వినోద్‌తో చెప్పింది నసీమా. దాంతో ఆగ్రహానికి గురైన వినోద్‌ స్నేహితుడు మణికంఠకునీ విషయం చెప్పాడు. ఎప్పటి నుంచో రాము హత్యకు ప్లాన్‌ చేస్తున్న మణికంఠ.. నసీమా, హిమాంబి, వినోద్‌తో కలిసి అతడిని హత్య చేయాలని భావించాడు.

దీనిలో భాగంగా యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌ నగర్‌లోని హిమాంబి ఇంటికి రాము రప్పించి.. రౌడీషీటర్‌ జిలానీ గ్యాంగ్‌తో హత్య చేయించారు నిందుతుల. ఆ తర్వాత రాము బామ్మర్దికి వీడియో కాల్‌ చేసి డెడ్ బాడీని తీసుకెళ్లమని చెప్పారు. రామును హత్య చేసిన తర్వాత.. మణికంఠ, వినోద్‌, మరికొందరు కలిసి రాంరెడ్డి నగర్‌లోని బార్‌ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాము హత్యతో ప్రమేయం ఉన్న వ్యక్తులతో పాటు హత్యకు ప్రోత్సహించిన నసీమా, ఆమె తల్లి హిమాంబి అలియాస్‌ హసీనాలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతుంది.