iDreamPost
android-app
ios-app

వీడియో: భర్త ఎంత ఇంటికి రాకపోతే మాత్రం ఇలా చేస్తారా?

వీడియో: భర్త ఎంత ఇంటికి రాకపోతే మాత్రం ఇలా చేస్తారా?

భర్త ఇంటికి రాకపోతే వేచి చూస్తూ ఉంటారు భార్యలు. లేకపోతే ఫోన్లు చేసి రమ్మని వేడుకుంటారు. అప్పటికీ రాకపోతే బెదిరిస్తారు. అప్పటికి కూడా వర్కౌట్ కాకపోతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇస్తారు. ఆ భయంతో అన్న భర్త తిరిగి వస్తాడన్న నమ్మకంతో. ఇలా ఎదోటి చేసి భర్తను ఇంటికి రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ, ఓ భార్య మాత్రం తన భర్త ఇంటికి రావడం లేదని ఏకంగా క్షుద్రపూజలు చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని కంచన్ బాగ్ హఫీజ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కంచన్ బాగ్ హఫీజ్ నగర్‌కు చెందిన ఓ మహిళ భర్త గత కొన్ని రోజులనుంచి ఇంటికి రావటం లేదు. భర్తను ఇంటికి రప్పించుకోవటానికి చాలా ప్రయత్నాలే చేసింది. కానీ, అవేవీ వర్కవుట్‌ కాలేదు. దీంతో క్షుద్ర పూజల్ని ఆశ్రయించింది. ఇంట్లో ఏవో సామాన్లతో పూజ చేసింది. ఆ తర్వాత ఇంటికి దగ్గరలో ఓ చిన్న గొయ్యి తవ్వింది. తెల్ల కవర్‌లో క్షుద్ర పూజలు చేసిన సామానులు ఉంచి, గొయ్యిలో వేసి పూడ్చింది. ఇది గమనించిన అక్కడి జనం ఆమెను ప్రశ్నించారు.

దీంతో ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. అనంతరం పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షుద్రపూజలు చేసిన మహిళను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆవీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘భర్త మీద ఎంత ప్రేమ ఉంటే ఆమె అలా క్షుద్రపూజలు చేస్తుంది’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, భర్త ఇంటికి రావటం లేదంటూ క్షుద్రపూజలు చేసిన మహిళకు సంబంధించిన ఈ ఘటనపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపం లో తెలియచేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/