iDreamPost
android-app
ios-app

జిమ్ సెంటర్ లో యువకుడి దారుణ హత్య! కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి..!

  • Published Aug 30, 2023 | 1:14 PM Updated Updated Aug 30, 2023 | 1:14 PM
  • Published Aug 30, 2023 | 1:14 PMUpdated Aug 30, 2023 | 1:14 PM
జిమ్ సెంటర్ లో యువకుడి దారుణ హత్య! కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి..!

హైదరాబాద్ లోని హైదర్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. సాక్షుల కథనం ప్రకారం.. దూల్ పేట్ కు చెందిన రాహుల్ సింగ్ (27) అనే యువకుడు చాలా కాలం నుంచి మణికొండలోని అలిజాపూర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే రాహుల్ సింగ్ రోజూ హైదర్ గూడలోని ఓ జిమ్ సెంటర్ కు వ్యాయమం కోసం వెళ్తు ఉండేవాడు.

ఇక ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం కూడా హైదర్ గూడలోని జిమ్ సెంటర్ కు వెళ్లాడు. ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు 6.30 నిమిషాలకు సెల్లార్ లోకి వచ్చాడు. కాగా, అప్పటికే నలుగురు గుర్తు తెలియని దుండగులు అక్కడే రాహుల్ సింగ్ కోసం కాపుకాచి ఉన్నారు. ఇక అతడు రాగానే మొదటగా అతని కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కానీ, మార్గమధ్యలోనే రాహుల్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకుని మృతుని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత రాహుల్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తుండగానే నిందితులు లొంగిపోయినట్లుగా తెలుస్తొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet