భర్త మృతి.. మరో వ్యక్తితో రిలేషన్‌.. చివరకు దారుణ స్థితిలో

ఆమెకు ముగ్గురు పిల్లలు సంతానం. కొన్నాళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఆ తర్వాత ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివరకు అత్యంత దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ వివరాలు..

ఆమెకు ముగ్గురు పిల్లలు సంతానం. కొన్నాళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఆ తర్వాత ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివరకు అత్యంత దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ వివరాలు..

వివాహేతర సంబంధాల వల్ల ఎలాంటి సమాజంలో చోటు చేసుకుంటున్న దారుణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తమ శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం పక్క వారి జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు కొందరు. మరి వారేమైనా బాగుంటున్నారా అంటే.. లేదు. అయినా ఎందుకు ఇలాంటి బంధాలు అంటే సమాధానం వారే చెప్పాలి. ఇక తాజాగా ఓ దారుణం చోటు చేసుకుంది. భర్త మృతితో ఆ మహిళ.. మరో వ్యక్తితో రిలేషన్‌ పెట్టుకుంది. ముగ్గురు సంతానం ఉన్న తర్వాత కూడా ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మరి చివరకు ఆ మహిళ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంది.. ఎలాంటి దారుణాలు చవి చూసింది అంటే..

ఆమెకు 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం భర్త.. మృతి చెందాడు. ఆ తర్వాత ఆ మహిళ మరో వివాహిత వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ప్రస్తుతం ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. చనిపోయిన మహిళను మాధవిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ ఠాణా పరిధి కౌకూర్‌ మల్లారెడ్డి కాలనీలో ఉంటున్న కృష్ణ, సుశీల దంపతుల కుమార్తె మాధవి(34) కి సుమారు 14 ఏళ్ల క్రితం అనగా 2007లో బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు చెందిన రాజుతో వివాహం జరిగింది. వారికి కుమారుడు పవన్‌(15), కుమార్తె శ్రీజ(13), కుమారుడు మున్నా(11) ఉన్నారు.

వారి జీవితం ఇలా సాగుతుండగా.. మూడేళ్ల క్రితం అనగా 2021లో మాధవి భర్త.. రాజు అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం మాధవి తన ముగ్గురు పిల్లలను తల్లి వద్ద ఉంచి చదివిస్తోంది. మృతురాలు ఏఎస్‌రావునగర్‌లోని ఓ డెంటల్‌ క్లినిక్‌లో సహాయకురాలిగా పని చేస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఆమెకు సికింద్రాబాద్‌ అడ్డగుట్టకు చెందిన సాయితో పరిచయం ఏర్పడింది. అతడికి కూడా అప్పటికే వివాహమైంది. అయినా ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గత 8 నెలల నుంచి మాధవి, సాయిలు సఫిల్‌గూడ బలరాంనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని కలిసి ఉంటున్నారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం 6:40కి సాయి.. మాధవి పెద్ద కుమారుడు పవన్‌కు ఫోన్‌ చేసి మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. మాధవి తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు వెళ్లి చూడగా గదిలో తలకు గాయమై రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. వెంటనే దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాల్ని సేకరించారు. మృతురాలి మాధవి దగ్గర 2 మొబైల్‌ ఫోన్లు, రూ.20 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం ఉంది. మాధవి మృతి తర్వాత అవి కనిపించలేదు. సాయి వాటిని తీసుకొని పరారయ్యాడని భావిస్తున్నారు. సాయి నడిపే ఆటో మాధవే కొన్నదని బంధువులు తెలిపారు. అతడు చిక్కితే అన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

చనిపోతానని మాధవికి ముందే తెలుసా..

అయితే చనిపోయిన మాధవి.. ఆదివారం రాత్రితనకు ఫోన్‌ చేసిందని ఆమె పెద్ద కుమారుడు పవన్‌ పోలీసులకు తెలిపాడు. తన వద్ద రూ.20వేలు ఉన్నాయని.. వాటితోపాటు తన ఫోన్‌ నుంచి మరో 8వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలని చెప్పిందన్నారు. ఈ క్రమంలో తనకు ప్రాణభయం ఉందని మాధవికి ముందుగానే తెలుసా.. లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో కొడుక్కి డబ్బులు అందజేయాలని అనుకొని ఫోన్‌ చేసిందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments