iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ, దీపావళి రోజే ఎందుకు ఇలా చేశాడో..!

  • Published Nov 14, 2023 | 4:11 PM Updated Updated Nov 14, 2023 | 4:11 PM

ఈ దంపతులు నగరంలోని నేరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే.. దీపావళి పండగ రోజే భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఏం చేశాడంటే?

ఈ దంపతులు నగరంలోని నేరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే.. దీపావళి పండగ రోజే భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఏం చేశాడంటే?

  • Published Nov 14, 2023 | 4:11 PMUpdated Nov 14, 2023 | 4:11 PM
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ, దీపావళి రోజే ఎందుకు ఇలా చేశాడో..!

పైన కనిపిస్తున్న వీళ్లిద్దరూ భార్యాభర్తలు. కులాలు వేరైనా గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు హైదరాబాద్ లోని ఓ చోట కాపురం పెట్టారు. భర్త కారు డ్రైవర్ గా పని చేస్తుండగా.., భార్య ఇంటి వద్దే ఉండేది. ఇకపోతే.. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. పుట్టిన బిడ్డను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. దీపావళి పండగా రోజు ఉన్నట్టుండి అతడు ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. దీంతో అత్తమామలు, బంధువులు షాక్ గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీగిరిపల్లికి చెందిన మహేందర్, వరంగల్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన స్రవంతి వీరుకున్న పరిచయం కారణంగా గతంలో ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరిద్దరి కులాలు వేరు కావడంతో మొదట్లో కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా సరే పెద్దలను ఒప్పించి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. అయితే, కొన్నాళ్ల పాటు వారి సొంతూరులోనే ఉండి ఏడాది నుంచి ఉప్పల్ జవహార్ నగర్ లోని ఓ ప్రాంతంలో కాపురం పెట్టారు. భర్త డ్రైవర్ గా పని చేస్తుండగా, భార్య కూతురుని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది.

గతంలో ఈ దంపతుల మధ్య కొన్ని గొడవలు జరిగాయి. దీంతో భార్య స్రవంతి కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. ఇకపోతే.. శనివారం రోజు భర్త మహేందర్ భార్యకు ఫోన్ చేసి.. నేను ఇళ్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. ఇక మరుసటి రోజు స్రవంతి సమతానగర్ లో భర్త ఉన్న అద్దెకు ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత దంపతులు ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఊగిపోయిన భర్త మహేందర్.. భార్య ముఖంపై దాడి చేశాడు. ఇంతే కాకుండా ఆమె మెడకు చున్నీ బిగించాడు. ఊపిరాడకపోవడంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇతగాడు భార్య శవాన్ని గదిలో ఉంచి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. భర్త వద్దకు వెళ్లిన స్రవంతి తిరిగి రావకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్రవంతికి ఫోన్ చేశారు. ఎటువంటి స్పందన రాలేదు.

దీంతో వెంటనే భర్త ఉంటున్న అద్దె ఇంటి వెళ్లి చూడగా.. ఇంటికి తాళం వేసి కనిపించింది. అనుమానంతో వారు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. గదిలో స్రవంతి శవమై తేలి మంచం కింద కనిపించింది. ఇది చూసి మృతురాలి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే స్రవంతి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఆ మహిళ కుటుంబ సభ్యులు ఈ దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పండగ రోజే మహేందర్ ఇలా చేయడంతో మృతురాలి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగితేలారు. ఇటీవల వెలుగు చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss