iDreamPost
android-app
ios-app

స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి.. అర్థరాత్రి బాత్రూం కిటికీ నుంచి పారిపోయి..!

హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో ఊహించని పరిణామం ఘటన చోటు చేసుకుంది. ఓ ఆశ్రయంలో ఉంటున్న ఓ యువతి.. ఉన్నట్టుండి అర్థరాత్రి బాత్రూం కిటికీ నుంచి పారిపోయింది. దీంతో ఆ ఆశ్రయం సిబ్బంది షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో ఊహించని పరిణామం ఘటన చోటు చేసుకుంది. ఓ ఆశ్రయంలో ఉంటున్న ఓ యువతి.. ఉన్నట్టుండి అర్థరాత్రి బాత్రూం కిటికీ నుంచి పారిపోయింది. దీంతో ఆ ఆశ్రయం సిబ్బంది షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి.. అర్థరాత్రి బాత్రూం కిటికీ నుంచి పారిపోయి..!

హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. స్టేట్ హోంలో చాలా కాలం నుంచి ఆశ్రయం పొందుతున్న ఓ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి బాత్రూం కిటికీ నుంచి దూకి పారిపోయింది. ఈ ఘటనతో స్టేట్ హోం సిబ్బంది షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ యువతి ఎవరు? ఎందుకు అర్థరాత్రి ఏకంగా కిటికీ నుంచి దూకి పారిపోయింది? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్ మధురానగర్ డివిజన్ పరిధిలో ఉన్న స్టేట్ హోంలో మల్లీశ్వరి అనే యువతి చాలా కాలంగా ఇక్కడే ఆశ్రయం పొందుతుంది. దీంతో పాటు నగరంలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే ఈ అమ్మాయి రోజూ కాలేజీకి వెళ్తూ తిరిగి ఇక్కడికి వస్తుండేది. ఇదిలా ఉంటే.. మల్లీశ్వరి ఎప్పటిలాగే సోమవారం రాత్రి అందరితో పాటు కలిసి భోజనం చేసింది. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లింది. కట్ చేస్తే.. అదే రోజు అర్థరాత్రి బాత్రూం కిటికీ నుంచి దూకి పారిపోయింది. ఇదే సమయంలో.. నాకు ఇన్ స్టా గ్రామ్ లో కడపకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. నేను అతడిని ప్రేమిస్తున్నానని, ఇక అతడితో పాటే వెళ్లిపోతున్నానని ఉత్తరంలో రాసి అక్కడ ఉంచి పరారైంది.

వెంటనే అప్రమత్తమైన స్టేట్ హోం సిబ్బంది ఆ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్టేట్ హోం అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి ఉన్నట్టుండి ప్రియుడితో పారిపోయిన మల్లీశ్వరి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.