iDreamPost
android-app
ios-app

అలాంటి అమ్మాయిలే ఇతని టార్గెట్! దొరికితే ఇక అంతే..!

ఇతనో కేటుగాడు, మాయగాడు, కంత్రీగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అవన్నీ ఇతడికే సెట్ అవుతాయి. ఒంటరి అమ్మాయిలు, జంటలను బెదిరిస్తూ ఊహించని దారుణాలకు పాల్పడ్డాడు. ఇంతకు ఇతగాడు చేసిన పాడు పనులు ఏంటో తెలుసా?

ఇతనో కేటుగాడు, మాయగాడు, కంత్రీగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అవన్నీ ఇతడికే సెట్ అవుతాయి. ఒంటరి అమ్మాయిలు, జంటలను బెదిరిస్తూ ఊహించని దారుణాలకు పాల్పడ్డాడు. ఇంతకు ఇతగాడు చేసిన పాడు పనులు ఏంటో తెలుసా?

అలాంటి అమ్మాయిలే ఇతని టార్గెట్! దొరికితే ఇక అంతే..!

ఇతనో కేటుగాడు, మాయగాడు, కంత్రీగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అవన్నీ ఇతడికే సెట్ అవుతాయి. అవును.., ఏకంగా అలాంటి అమ్మాయిలనే ఇతడు టార్గెట్ గా చేసుకుని గలీజ్ దాందాకు తెర లేపాడు. ఇతని మాయలు తెలియని కొందరు అమ్మాయిలు అడిగిన వివరాలన్నీ చెబుతారు. ఇక తీరా చూస్తే.. ఇతడో కంత్రీగాడని తెలిసి మోసపోయామంటూ చివరికి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇలా ఎంతో మంది ఒంటరిగా కనిపించిన అమ్మాయిలు, జంటలతో చేయాల్సిన దారుణాలన్నీ చేశాడీ కేటుగాడు. మొత్తానికి ఇతగాడు చేసిన ఆ దారుణాలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో తాజాగా అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో అమ్మాయిలు, ఒంటరి జంటను భయంతో వణికిపోతున్నారు. ఇంతకు ఈ ఘటనలో ఏం జరిగింది? ఈ మాయగాడు చేసిన దారుణం ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. వయసులో ఉన్న కొందరు అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్ ప్రేమలో పడడం కామన్. ఇక ప్రేమించిన వారితో మనసు విప్పి మాట్లేడేందుకు ఓ ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఇక వారు అనుకున్నట్లే జన సమూహం లేని ప్రాంతానికి వెళ్లి ప్రియుడితో సరదాగా కబుర్లు చెప్పుకుని ఆ తర్వాత ఎవరింటికి వారు చెక్కేస్తారు. ఇలాంటి ఒంటరి జంటపైనే కన్నేశాడు జనగాంకు చెందిన మరాఠీ సృజన్ కుమార్ అనే వ్యక్తి. ఇతడు గతంలో శ్రావణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని నెలలకే అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.

అప్పటి నుంచి సృజన్ కుమార్ ఒంటరిగా ఉంటూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇక చేతిలో చిల్ల గవ్వ లేకపోవడంతో ఈజీ మనీ కోసం అనేక ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇతగాడికి ఓ ఐడియా తట్టింది. అదే ఒంటరి జంటలను టార్గెట్ చేయడం. ప్రియుడితో కలిసి పార్కులకు వచ్చిన అమ్మాయిలపై కన్నేస్తూ అందిన కాడికి దోచుకోవడం. అయితే ఇందులో భాగంగానే సృజన్ కుమార్ నకిలీ పోలీస్ అవతారమెత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో జంటను మోసం చేశాడు. ఇక ఇటీవల హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వేదికగా చేసుకుని దారుణాలు చేయడం ప్రారంభించాడు. ఒంటరిగా కనిపించిన జంట వద్దకు వెళ్లి మీపై ఆ కేసులు పెట్టి జైల్లో పెడతానని, లేదంటే నాకు డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు.

గత కొన్ని రోజుల నుంచి కొన్ని జంటను ఇలాగే బెదిరించి బాగానే డబ్బును దండుకున్నాడు. ఇటీవల కూడా ఓ జంటను బెదిరించి వారి నుంచి రెండు మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్లుగా సమాచారం. దీంతో బాధితులు వెంటనే సెక్రటేరియట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సృజన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. పూర్తిగా విచారించే సరికి ఇతనో ఫేక్ పోలీస్ అని, ఇతనిపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలో 20పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి ఒంటరి జంటలను బెదిరించి డబ్బులు దండుకున్న ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి