iDreamPost
android-app
ios-app

క్షణకాల సుఖం కోసం.. కన్న ప్రేమను మరిచి కసాయిగా మారిన తల్లి!

  • Published Jul 12, 2023 | 11:28 AM Updated Updated Jul 12, 2023 | 11:28 AM
  • Published Jul 12, 2023 | 11:28 AMUpdated Jul 12, 2023 | 11:28 AM
క్షణకాల సుఖం కోసం.. కన్న ప్రేమను మరిచి కసాయిగా మారిన తల్లి!

మనం ఏర్పర్చుకునే అన్ని బంధాల్లో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. కానీ మన నుంచి ఏం ఆశించకుండా.. ఎంతో నిస్వార్థంగా ప్రేమించింది కేవలం తల్లి మాత్రమే. తాను మరణించి అయినా సరే బిడ్డలకు ప్రాణం పోస్తుంది. తాను తిన్నా, తినకపోయినా బిడ్డల కడుపు నింపడానికి ప్రయత్నిస్తుంది. తల్లి ప్రేమ అంత గొప్పది కాబట్టే.. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవించడం కోసం దేవుడు మనిషి జన్మ ఎత్తుతాడని చెబుతారు. అయితే నేటి కాలంలో తల్లి ప్రేమ కూడా కల్తీ అయిపోతుంది. బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లుల స్థానంలో.. తమ సుఖం కోసం అడ్డు వస్తే పిల్లలను కూడా అంతమొందిచడానికి వెనకాడటం లేదు. క్షణకాల సుఖం కోసం కన్నప్రేమను మరిచి కడుపున పుట్టిన పిల్లలను సైతం కడతేరుస్తున్నారు కొందరు కసాయి తల్లులు.

తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భావించి కన్నబిడ్డను కడతేర్చి.. ఏం తెలియని అమాయకురాలిలా నాటకం ఆడింది ఓ కసాయి తల్లి. కానీ చిన్నారి తండ్రికి అనుమానం వచ్చి.. పోలీసులను ఆశ్రయించడంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్‌ కుషాయిగూడలో చోటు చేసుకుంది. జూలై 1న జరగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతి చెందిన చిన్నారి తన్విత.. నవ మాసాలు మోసి తనను కన్న తల్లి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఇంతకు ఏం జరిగింది అంటే.. బాధిత చిన్నారి తల్లి కళ్యాణి, తండ్రి రమేష్‌ కుమార్‌లది ప్రేమ వివాహం. తన్విత తండ్రి డ్రైవర్‌గా పని చేస్తుండగా.. తల్లి కూరగాయల మార్కెట్‌లో పని చేస్తోంది. అయితే మనస్పర్థల కారణంగా 2021 నుంచి రమేష్‌, కళ్యాణిలు విడిగా ఉంటున్నారు. భర్త నుంచి విడిపోయిన కళ్యాణి కుమార్తె తన్వితను తీసుకుని వెళ్లి.. తన తలిద్దండ్రులు నివాసం ఉంటున్న కుషాయిగూడలోనే.. వారికి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. తన్విత స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో నర్సరీ చదువుతోంది.

ఇదిలా ఉండగా.. కళ్యాణికి స్థానికంగా ఉన్న ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తన్విత తమ బంధానికి అడ్డుగా ఉందని భావించిన కళ్యాణి.. కన్నప్రేమను సైతం మర్చిపోయి.. చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసింది. జూలై 1, శనివారం మధ్యాహ్నం స్కూల్‌ నుంచి వచ్చి.. భోజనం చేసి కాసేపు ఆడుకుని నిద్ర పోయింది. ఇదే అవకాశంగా భావించిన కళ్యాణి.. చిన్నారికి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత ఏం తెలియనట్లు.. తన కుమార్తె నిద్రలోనే మృతి చెందింది అంటూ ఏడుస్తూ.. అందరిని నమ్మించింది. అయితే కళ్యాణి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె భర్త రమేష్‌.. జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో చిన్నారి తన్వితది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఊపిరాడకపోవడం వల్లే చిన్నారి మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తెలిసింది. దాంతో పోలీసులు చిన్నారి తల్లి తన్వితను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో తానే కుమార్తెని హత్య చేసినట్లు కళ్యాణి అంగీకరించింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş