iDreamPost
android-app
ios-app

అలా చేయాలంటూ భార్య టార్చర్! నా వల్ల కాదంటూ భర్త ఆత్మహత్య!

  • Published Jul 06, 2023 | 11:46 AM Updated Updated Jul 06, 2023 | 11:47 AM
  • Published Jul 06, 2023 | 11:46 AMUpdated Jul 06, 2023 | 11:47 AM
అలా చేయాలంటూ భార్య టార్చర్! నా వల్ల కాదంటూ భర్త ఆత్మహత్య!

హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య టార్చర్ భరించలేక ఓ భర్త ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ విషయంలో భార్య భర్తను టార్చర్ పెట్టింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ ప్రాంతంలో వెంకట్ రెడ్డి (38)-కళ్యాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అప్పటి వరకు వీరి కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది. అయితే, గత కొంత కాలం నుంచి కళ్యాణి అత్తను ఇంట్లో నుంచి పంపించి, ఆస్తిని పిల్లల పేర్ల మీద రాయాలని తరుచు ఒత్తిడి చేసేది. ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతులు గొడవ పడుతునే ఉన్నారు.

ఈ క్రమంలోనే కళ్యాణి పుట్టింటికి కూడా వెళ్లొచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల కూడా భార్య కళ్యాణి అత్తను, పంపించి ఆస్తి రాయించాలని టార్చర్ చేసింది. దీంతో భర్త వెంకట్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. ఇక నా వల్ల కాదనుకున్న వెంకట్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobet