iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో విషాదం.. మరి కొన్ని రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే

  • Published Oct 02, 2023 | 11:27 AM Updated Updated Oct 02, 2023 | 11:27 AM
  • Published Oct 02, 2023 | 11:27 AMUpdated Oct 02, 2023 | 11:27 AM
హైదరాబాద్‌లో విషాదం.. మరి కొన్ని రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే

చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో పిల్లల ఇష్టాలకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు.. ప్రేమ, పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం.. తమ నిర్ణయమే ఫైనల్‌ అంటారు. అంటే తల్లిదండ్రుల ఆలోచన తప్పని కాదు. కన్నబిడ్డల సుఖమే వారు కోరుకుంటారు. తల్లిదండ్రులు ఏ నిర్ణయం తీసుకున్న బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. వారికి అన్ని విధాలా ది బెస్ట్‌ ఇవ్వాలనే తాపత్రయపడతారు. అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాల వల్ల బిడ్డల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి హైదరాబాద్‌లో వెలుగు చూసింది. కన్న బిడ్డను కళ్లల్లో పెట్టి చూసుకున్నారు.. ఆమె ఎంత వరకు చదువుతానంటే.. అంత వరకు చదివించారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం కుమార్తె నిర్ణయాన్ని ఆతల్లిదండ్రులు పట్టించుకోలేదు. దాంతో మనస్థాపానికి గురైన యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

హైదరాబాద్ జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే మనస్థాపంతో ఓ ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. సుభాష్‌ నగర్‌ లాస్ట్‌ బస్టాప్‌ ప్రాంతంలో ఉండే కరీంశెట్టి జన్ని, సత్యవతి దంపతుల కుమార్తె యువనాగదుర్గ(23). ప్రస్తుతం ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. ఇలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం నాగదుర్గ తల్లిదండ్రులు.. ఆమెకు వివాహం నిశ్చయించారు. స్థానికంగా ఉండే పెయింటర్‌తో.. నాగదుర్గకు పెళ్లి నిశ్చయం చేయడం మాత్రమే కాక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా చేశారు. మరి కొన్ని రోజుల్లో ఆమె వివాహం జరగాల్సి ఉంది.

అయితే నాగదుర్గకు ముందు నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ ఆమె వినకుండా.. బలవంతంగా పెళ్లికి ఒప్పించారు నాగదుర్గ తల్లిదండ్రులు. ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేని నాగదుర్గ.. తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న నాగదుర్గ తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో నాగదుర్గ, ఆమె సోదరుడు మాత్రమే ఉన్నారు.

శనివారం మధ్యాహ్నం సోదరుడు భోజనం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగదుర్గ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఇంటికి వచ్చిన సోదరుడు ఆమె ఫ్యానుకు వేలాడుతుండటాన్ని గమనించి ఇరుగుపొరుగు వారి సాయంతో కిందకు దించాడు. అయితే ఆమె అప్పటికే మృతి చెందింది. పెళ్లి ఇష్టం లేనందునే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş