iDreamPost
android-app
ios-app

హైదరాబాద్: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కింద పడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మాారింది.

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కింద పడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మాారింది.

హైదరాబాద్: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్ లో గత కొంత కాలం నుంచి రోడ్డు ప్రమాదాలకు గురై స్కూల్ కు వెళ్లే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. మరీ ముఖ్యంగా స్కూల్ బస్సులు ప్రమాదానికి గురై ఎంతో మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. కొన్ని ఘటనల్లో చనిపోయిన వారు కూడా లేకపోలేరు. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ లో ఓ మూడేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కింద పడి మృతి చెందింది. అప్రమత్తమైన ఆ పాప తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆ చిన్నారి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా వెలుగు చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జవహర్ నగర్ లోని ఓ కాలనీలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భవ్యశ్రీ (3) అనే కూతురు ఉంది. కూతురుని అల్లారు ముద్దుగా చూసుకుంటూ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవారు. అయితే శనివారం ఉదయం తల్లిదండ్రులు ఏదో పనిమీద ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలోనే వారి కూతురు  ఉన్నట్టుండి ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో అటు నుంచి వేగంగా వచ్చిన ఓ స్కూల్ బస్సు ఆ చిన్నారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి రక్తపు మడుగులో పడి తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ చిన్నారి తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆ పాప అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని ఆ పాప తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

ఈ ఘటనతో స్థానికులు అంతా కలిసి ఆ స్కూల్ బస్సు డ్రైవర్ పై దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అంతా పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి వరకు కళ్లముందు ఆడుతూ పాడుతూ తిరిగి కూతురు ఇక తిరిగా రాదని తెలియడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ పాప మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. స్కూల్ బస్సు కిందపడి చనిపోయిన ఈ చిన్నారి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి