iDreamPost
android-app
ios-app

కృష్ణవేణి ఓ బ్యాంకులో ఉద్యోగి.. నేరుగా అతనికి ఫోన్ చేసి..!

  • Published Jul 03, 2023 | 7:25 PM Updated Updated Jul 03, 2023 | 7:25 PM
  • Published Jul 03, 2023 | 7:25 PMUpdated Jul 03, 2023 | 7:25 PM
కృష్ణవేణి ఓ బ్యాంకులో ఉద్యోగి.. నేరుగా అతనికి ఫోన్ చేసి..!

ఈ యువతి పేరు కృష్ణవేణి. వయసులో కూడా చాలా చిన్నదే. కొంత వరకు చదువుకున్న ఈ యువతి ఆ తర్వాత నగరంలోని ఓ బ్యాంకులో ఉద్యోగం పొందింది. అలా కొంత కాలం పాటు అక్కడే జాబ్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆ యువతి ఉన్నట్టుండి నేరుగా అతనికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆమె మాటలు విన్న అతడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇదంతా నిజమేనా అని తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి ఇది నిజమేనని తెలుసుకుని నెత్తి, నోరు బాదుకున్నాడు. హైదరాబాద్ లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈ యువతి ఎవరు? ఆమె చేసిందేంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఫిలింనగర్ లోని బాలరెడ్డి నగర్ లో ప్రవీణ్ కుమార్-సాయి కృష్ణవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత నాలుగేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకు వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు మూడేళ్లు. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజుల నుంచి కృష్ణవేణి నగరంలోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తుంది. రోజూ ఆఫీసుకి వెళ్తూ వస్తుండేది. ఇకపోతే.., ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఈ నెల 1న కృష్ణవేణి నేరుగా తన భర్త ప్రవీణ్ కు ఫోన్ చేసి.. నేను ఉద్యోగం మానేశాను. ఇంటి నుంచి వెళ్లిపోతున్నా.. అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది.

దీంతో భర్త ప్రవీణ్ ఖంగారుపడి వెంటనే భార్యకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అతడు ఇంటికి వచ్చి చూసే సరికి.. కృష్ణవేణి కనిపించకపోగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇది చూసి భర్త ప్రవీణ్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఆ తర్వాత అనేక సార్లు భార్య కృష్ణవేణికి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. మళ్లీ స్విచ్చాఫ్ వచ్చింది. ఇక చేసేదేం లేక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి కృష్ణవేణి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom