iDreamPost
android-app
ios-app

వీడెక్కడి సైకోరా బాబు.. ఆ మాత్రం దానికే ఇంత ఘోరమా..?

  • Published Feb 06, 2024 | 8:13 PM Updated Updated Feb 06, 2024 | 8:13 PM

ఈ మధ్య కాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా కొందరు కోపంతో ఊగిపోతూ దారుణాలుకు ఒడిగడుతున్నారు. అలాంటి ఓ ఘటన హైదరాబాద్​లో జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మధ్య కాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా కొందరు కోపంతో ఊగిపోతూ దారుణాలుకు ఒడిగడుతున్నారు. అలాంటి ఓ ఘటన హైదరాబాద్​లో జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 06, 2024 | 8:13 PMUpdated Feb 06, 2024 | 8:13 PM
వీడెక్కడి సైకోరా బాబు.. ఆ మాత్రం దానికే ఇంత ఘోరమా..?

ఒకప్పుడు చిన్న తప్పు చేయాలన్నా అందరూ భయపడేవారు. తప్పు చేశామని బయటపడితే పరువు పోతుందని జంకేవారు. కోర్టులు వేసే శిక్షలకు భయపడి చట్టాన్ని ఉల్లంఘించాలంటే వణికిపోయేవారు. అయితే రానురాను జనాల్లో నేరపూరిత ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య కాలంలో శ్యాడిజం, సైకోయిజానికి సంబంధించిన లక్షణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా కోపానికి గురవడం, ఆవేశంతో ఊగిపోతూ ఊహించని దారుణాలకు పాల్పడటం ఎక్కువుతోంది. ఆగ్రహంలో దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి గురించి వింటే ఇంత చిన్నదానికి కూడా అంతగా రియాక్ట్ అవ్వాలా? ఆ మాత్రం దానికే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేయాలా? అని ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి ఒక ఘటనే తాజాగా హైదరాబాద్​లోని మధురానగర్​లో జరిగింది.

షూ విషయంలో ఇద్దరు అన్నాదమ్ముల మధ్య గొడవ తలెత్తింది. ఇది కాస్తా హత్యకు దారితీసింది. మధురానగర్​కు చెందిన అభిషేక్ అలెక్స్​, ప్రవీణ్​ మోసెస్ మద్య షూ విషయంలో గొడవ జరిగింది. అది కాస్తా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత దాకా వెళ్లింది. అయితే ఈ దాడిలో కోపంతో ఊగిపోయిన అభిషేక్ తన తమ్ముడ్ని విచక్షణారహితంగా కొట్టాడు. తమ్ముడు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టడంతో ప్రవీణ్​ స్పృహ తప్పి కింద పడిపోయాడు. దెబ్బలకు తట్టుకోలేక ప్రవీణ్​ స్పృహ తప్పి పడిపోవడాన్ని కొందరు స్థానికులు గమనించారు.

ప్రవీణ్​ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే హాస్పిటల్​కు చేరుకునే లోపే అతడు ప్రాణాలు వదిలాడని స్థానికులు చెబుతున్నారు. అన్నాదమ్ముల మధ్య ఘర్షణ.. అందులో తమ్ముడు చనిపోయిన విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ్ముడు ప్రవీణ్​ మరణానికి కారణమైన అన్న అభిషేక్​ను పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇంత చిన్న కారణానికే సొంత తమ్ముడ్ని చంపడం ఏంటని షాకవుతున్నారు. వీడెక్కడి సైకోరా బాబు.. ఇంత మాత్రానికే ప్రాణాలు తీయడం ఏంటని కామెంట్ చేస్తున్నారు. మరి.. షూ కోసం అన్న తన సొంత తమ్ముడ్ని దారుణంగా కొట్టి చంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. ఆమెకి 8 నిమిషాలు నరకం చూపించి!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişantikbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom