iDreamPost
android-app
ios-app

హైదరాబాద్: స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. బయటపడ్డ గలీజ్ దందా!

  • Published Sep 02, 2023 | 1:18 PM Updated Updated Sep 02, 2023 | 1:18 PM
  • Published Sep 02, 2023 | 1:18 PMUpdated Sep 02, 2023 | 1:18 PM
హైదరాబాద్: స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. బయటపడ్డ గలీజ్ దందా!

హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి చాప కింద నీరులా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కొందరు నిర్వాహకులు స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో ఈ గలీజ్ దందాను నడిపిస్తూ పాడు పనులకు తెర లేపుతున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. కొందరు నిర్వాహకులు స్పా సెంటర్ పేరుతో తెర వెనుక నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నట్లు తేలింది. పోలీసులు తాజాగా కొన్ని స్పా, మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించగా ఈ వ్యవహారం బయట పడింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో కొందరు నిర్వాహకులు గత కొంత కాలంగా స్పా, మసాజ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. అయితే వీళ్లు పైకి స్పా, మసాజ్ సెంటర్లా కనిపిస్తున్నా.. లోపల మాత్ర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే సీసీఎస్ పోలీసులు శనివారం అనుమానం ఉన్న కొన్ని స్పా, మసాజ్ సెంటర్లపై యాంటి ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా ఈ సెంటర్లను నడిపిస్తున్నట్లు తేలింది. ఇదే కాకుండా అందులో సీసీ కెమెరాలు లేకపోవడం, రిజిస్టర్లలో కస్టమర్ల వివరాలు పొందు పరచకపోవడం వంటివి బయటపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులు ఈ సెంటర్లను నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom