iDreamPost
android-app
ios-app

తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులు.. చుక్కలు చూపించిన తల్లీకూతుళ్లు..

  • Published Mar 21, 2024 | 9:33 PM Updated Updated Mar 21, 2024 | 9:33 PM

Hyderabad Begumpet: ఆడవాళ్లని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పెరిగిపోయింది. చాలామంది అగంతుకలకు భయపడి డబ్బు, నగలు ఇచ్చేస్తుంటారు. ఈ తల్లీకూతుళ్లు మాత్రం దుండగులకు చుక్కలు చూపించారు.

Hyderabad Begumpet: ఆడవాళ్లని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పెరిగిపోయింది. చాలామంది అగంతుకలకు భయపడి డబ్బు, నగలు ఇచ్చేస్తుంటారు. ఈ తల్లీకూతుళ్లు మాత్రం దుండగులకు చుక్కలు చూపించారు.

  • Published Mar 21, 2024 | 9:33 PMUpdated Mar 21, 2024 | 9:33 PM
తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులు.. చుక్కలు చూపించిన తల్లీకూతుళ్లు..

ప్రస్తుతం ప్రాంతంతో సంబంధం లేకుండా నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక దగ్గర దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. ఈమధ్యకాలంలో చైన్ స్నాచింగ్లు కూడా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు దొంగలు కూడా తెవిలిమీరి పోతున్నారు. ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి దూరి ఆయుధాలతో బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు భయపడితో ప్రాణభయంతో డబ్బు, నగలు ఇచ్చేస్తుంటే.. ఇలాంటి ఆడవాళ్లు మాత్రం ఎదురుతిరిగి దుండగులను తరిమి తరిమి కొడుతున్నారు. ఆడవాళ్లను అబలలుగా భావించి మాటువేసి దోపిడీ చేయాలని చూస్తున్న వారికి ఇదొక గుణంపాఠం అనే చెప్పాలి.

ఆడదంటే అబల కాదు.. సబల అనే నానుడి అందరికీ తెలిసిందే. అయితే చాలా విషయాల్లో ఆడవాళ్లను చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. కానీ, తేడాలొస్తే భద్రకాళి రూపం కూడా దాల్చగలదని ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎవరైనా ఒప్పుకోవాల్సింది. విషయం ఏంటంటే.. హైదరాబాద్ బేగంపేటలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు దుండగులు ఒక తుపాకీ తీసుకుని ఓ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఇంట్లో కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉన్నారని తెలుసుకున్నట్లు ఉన్నారు. అందుకే ఆ ఇంటిని టార్గెట్ చేసుకుని దోపిడీకి పథకం రచించారు. అనుకున్నదే తడవుగా ఇద్దరు అగంతకులు గేటు తీసుకుని కారిడార్ లోగా మెయిన్ డోర్ దగ్గరకి వచ్చారు.

మెయిన్ డోర్ దగ్గర ఏదో చెప్తున్నట్లుగా నటించి ఒక పాత నాటు తుపాకీ బయటకు తీసి ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. అయితే ఆ ఇంట్లో మహిళ గన్ పట్టుకున్న వాడిని బయటకు లాక్కొంచింది. అతనితో గట్టిగానే పోరాడింది. ఎంతకా గన్ పట్టుకున్న అతని చేతిని వదల్లేదు. ఆమెకు కుమార్తె కూడా తోడు వచ్చింది. ధైర్యంగా అగంతుకలతో కుమార్తె కూడా పోరాడింది. ఆ తల్లి అతని దగ్గరి నుంచి గన్ లాక్కుంది. అతనికే ఎక్కు పెట్టింది. ఎక్కడ ఆమె గన్ తో కాలుస్తుందో అని వాడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిజానికి కాసేపు ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ మహిళ ఎక్కడా తగ్గకుండా అతనికి తగిన బుద్ధి చెప్పింది.

రెండో వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అతను భయంతో ఇంట్లోనే ఉండిపోయాడు. అయితే అప్పటికే రోడ్డు మీద ఉన్న కొందరు లోపలికి వచ్చారు. రెండో వ్యక్తిని ఆ మహిళ బయటకు లాక్కొచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇద్దరు అగంతకులు పరారయ్యారు. అయితే ఈ మొత్తం వ్యవహారం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. కేస్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు, ఆ తల్లీకూతుళ్ల ధైర్యసాహసాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహిళలే కదా అని వాడు ఇంట్లోకి వచ్చాడు. కానీ, తగిన బుద్ధి చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తల్లీకూతుళ్ల తెగువపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. అగంతకులను తరిమి తరిమి కొట్టిన ఈ తల్లీకూతుళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss