iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో అర్థరాత్రి పాడు పనులు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు!

హైదరాబాద్ వేదికగా గత కొన్నేళ్ల నుంచి చాప కింద నీరులా పాడు పనులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటివి గలీజ్ పనులు తాజాగా మరో చోట వెలుగు చూసింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ వేదికగా గత కొన్నేళ్ల నుంచి చాప కింద నీరులా పాడు పనులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటివి గలీజ్ పనులు తాజాగా మరో చోట వెలుగు చూసింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ లో అర్థరాత్రి పాడు పనులు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు!

హైదరాబాద్ వేదికగా గత కొన్నేళ్ల నుంచి చాప కింద నీరులా పాడు పనులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిరుపేద మహిళలు, అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని గలీజ్ దందాకు తెర లేపుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇక పోలీసులు పక్కా సమాచారంతో వెళ్లి ఆ గృహాలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో పోలీసులు ఎంతో మంది నిరుపేద మహిళలను, అమ్మాయిలను రక్షించారు. ఇంతే కాకుండా ఈ పాడు పనులను నిర్వహించిన నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అయితే ఈ వరుస ఘటనలు మరువకముందే ఇలాంటి గలీజ్ దందానే హైదరాబాద్ లో మరొకటి వెలుగు చూసింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు వ్యభిచారం గృహంపై దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
పోలీసుల  కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని అత్తాపూర్ ప్రాంతానికి  చెందిన కొందరు వ్యక్తులు ఈజీ మని కోసం అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి నిరుపేద మహిళలు, అమ్మాయిలను ఆసరాగా చేసుకుని వ్యభిచారాన్ని నిర్వహించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే  అత్తాపూర్ పరిధిలోని శివరాంపల్లిలోని ఓ కాలనీలో ఆరు మంది వ్యక్తులు కలిసి ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడే వాళ్లు వ్యభిచారాన్ని ప్రారంభించారు. గత కొంత కాలం నుంచి నిర్వాహకులు ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల కూడా కొందరు మహిళలను తీసుకొచ్చి ఈ గలీజ్ దందాకు తెర లేపారు.
ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక పక్కా ప్లాన్ తో కదిలిన పోలీసులు వారి వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా ఆరు మంది నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. దీంతో పాటు వారి వద్ద 25 కండోమ్స్, 6 మొబైల్స్ తో పాటు కొంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయంశంగా మారుతోంది.