iDreamPost
android-app
ios-app

హైదరాబాద్: రెచ్చిపోయిన దోపిడి దొంగలు! మరీ ఇంత దారుణమా?

  • Published Jul 12, 2023 | 5:22 PM Updated Updated Jul 12, 2023 | 5:22 PM
  • Published Jul 12, 2023 | 5:22 PMUpdated Jul 12, 2023 | 5:22 PM
హైదరాబాద్: రెచ్చిపోయిన దోపిడి దొంగలు! మరీ ఇంత దారుణమా?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ హమాలీ కూలీపై దోపిడి దొంగలు రెచ్చిపోయి ప్రవర్తించారు. అడ్డగించి అతని వద్ద ఉన్న నగదును దోచుకున్నారు. ఇదే కాకుండా ఈ దొంగలు మరో అఘాయిత్యానికి ఒడిగట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే, సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కొరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ అత్తాపూర్ లో బుధవారం ఉదయం అడ్డాపై ఓ హమాలీ కూలీ ఎప్పటిలాగే నిలిచున్నాడు. అక్కడికి చేరుకున్న కొందరు దొంగలు ఓ వ్యక్తిని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న రూ.12 వేల నగదును దోచుకున్నారు. ఇక ఇంతటితో ఆగని ఈ దోపడి దొంగలు బరితెగించి ప్రవర్తించారు. అతని బట్టలు పూర్తిగా విప్పేసి నగ్నంగా నిలిచోబెట్టారు. దీంతో పాటు అతని బట్టలను దూరంగా విసిరేశారు. ఇదంతా కొందరు వ్యక్తులు గమనించి వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన కొందరు అసలు మీరేం మనుషులు రా బాబు.., ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet