Vinay Kola
Crime: 2015 లో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేస్ పై గుంటూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Crime: 2015 లో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేస్ పై గుంటూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Vinay Kola
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2015 లో ఓ దారుణతి దారుణమైన ఘటన జరిగింది. అప్పుడు వరంగల్ కి చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. 2015 జులై 14న రిషితేశ్వరి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన అప్పట్లో ఒక రేంజిలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో ఆమె రాసిన సుసైడ్ లేఖ కూడా దొరికింది. ఆ లేఖ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ర్యాంగింగ్ వేధింపులే తన మరణానికి కారణమని, అందుకే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నా అని ఆ లెటర్లో రిషితేశ్వరి పేర్కొన్నారు. ఈ లేఖని ఆధారం చేసుకొని పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో సుదీర్ఘకాలం పాటు విచారణ కూడా జరిగింది. 9 ఏళ్ల పాటు ఈ కేసులో విచారణ కొనసాగింది. ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. కోర్టు నుంచి అంతిమ తీర్పు వచ్చింది. అయితే సరైన సాక్షాలు లేని కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం నాడు గుంటూరు కోర్టు జడ్జి కొట్టివేశారు. దీంతో ఈ కేసులో నిందితులకు ఊరట లభించింది.
ప్రస్తుతం ఈ విషయం షాకింగ్ గా మారింది. అయితే రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కోర్టు కొట్టివేయడంపై ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి రాసిన లెటర్ ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని వారు ప్రశ్నించారు. ఈ కేసులో దాదాపు 170 మంది సాక్షులు ఉన్నారని కూడా వారు తెలిపారు. న్యాయం కోసం పోరాటం చేస్తామని, కచ్చితంగా అధికారులను కలుస్తామని వారు చెప్పారు. పై కోర్టులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేదని, ప్రభుత్వమే తమకు సాయం చేయాలని కోరారు. ఈ కేసులో తమకు తగిన న్యాయం కనుక జరగకపోతే చివరికి మరణమే తమకు దిక్కు అని రిషితేశ్వరి తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.