iDreamPost
android-app
ios-app

భార్యను చంపిన భర్త, తండ్రికి దిమ్మతిరిగే షాకిచ్చిన కుమారుడు!

గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతురాలి కుమారుడు తండ్రికి ఊహించిన షాకిచ్చాడు. అసలేం జరిగిందంటే?

గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతురాలి కుమారుడు తండ్రికి ఊహించిన షాకిచ్చాడు. అసలేం జరిగిందంటే?

భార్యను చంపిన భర్త, తండ్రికి దిమ్మతిరిగే షాకిచ్చిన కుమారుడు!

భార్యాభర్తలు అన్నాక గొడవ పడడం కామన్. అయితే మాట్లాడుకుంటే సమిసిపోయే సమస్యలను కొందరు దంపతులు గొడవల దాక తెచ్చుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.., ఇలా ఎవరికి వారు పోటాపోటీగా మాటల యుద్దం చేసుకుంటూ గోరుతో పోయే దాన్నిచివరికి గొడ్డలిదాక తెచ్చుకుని హత్యలు, ఆత్మహత్యలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ భర్త తన భార్యపై కోపంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. తల్లి మరణంతో ఆమె కుమారుడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. కానీ, ఆ యువకుడు తండ్రి చేసిన దారుణాన్ని మరిచిపోకుండా చివరికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ ఛోటాలోని ఉదయ్ పూర్ కు చెందిన రేమ్లా-ఝంకీ దంపతులు. వీళ్లు బతుకు దెరువు కోసం మోర్బీకు వెళ్లి అక్కడే రైతు కూలీలుగా పని చేస్తున్నారు. వీళ్లతో పాటు వారి కుమారుడు కూడా అక్కడే పని చేసేవాడు. అలా చాలా కాలం నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇకపోతే.. ఈ భార్యాభర్తలు గత కొంత కాలం నుంచి తరుచు గొడవ పడుతున్నారు. భర్త రేమ్లా ప్రతీ చిన్న విషయానికి గొడవ భార్యతో పడుతూ ఆమెను వేధించేవాడు. అయితే మంగళవారం కూడా ఈ భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన భర్త రేమ్లా.. తన భార్య ఝంకీపై దాడి చేశాడు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

వెంటనే స్పందించిన వీరి యజమాని మృతదేహంతో పాటు మీ సొంతూరైన ఉదయ్ పూర్ కు వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో హస్ముఖ్ తన తల్లి మృతదేహాంతో పాటు తండ్రిని వెంట పెట్టుకుని దాదాపు 410 కి.మీ ప్రయాణించి తన సొంతూరుకు బయలు దేరారు. కట్ చేస్తే.. మృతురాలి కుమారుడు హస్ముఖ్ సొంతూరు రాగానే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు జరిగిందంతా వివరించాడు. ఆ తర్వాత ఇంతటి దారుణానికి పాల్పడ్డ తండ్రి రేమ్లాతో పాటు తల్లి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించాడు. కుమారుడు చేసిన పనికి తండ్రి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet