P Krishna
Gujarat Crime News: కొంతమంది క్షణిక సుఖాలకు బంగారం లాంటి భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. గొప్పంటి కోడలు అయిన ఉండి.. ఓ గ్యాంగ్‌స్టర్‌ని నమ్మి కుటుంబానికి తలవంపులు తెచ్చేలా అతనితో వెళ్లిపోయింది. చివరికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
Gujarat Crime News: కొంతమంది క్షణిక సుఖాలకు బంగారం లాంటి భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. గొప్పంటి కోడలు అయిన ఉండి.. ఓ గ్యాంగ్‌స్టర్‌ని నమ్మి కుటుంబానికి తలవంపులు తెచ్చేలా అతనితో వెళ్లిపోయింది. చివరికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
P Krishna
ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ క్షోభకు గురి చేస్తున్నారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఒక కారణం అయితే.. వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల వల్ల ఎన్నో దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో కొంతమంది చేసే పనుల వల్ల తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఐఏఎస్ అధికారి భార్య అయి ఉండి నేరాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గ్యాంగ్‌స్టర్ ని నమ్మి అతనితో లేచిపోయింది. చివరికి ఆమె జీవితంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రంజిత్ సింగ్ జె అనే ఐఏఎస్ భార్య కొన్ని నెలల క్రితం తమిళనాడు గ్యాంగ్‌స్టర్ అయిన మహారాజాతో కలిసి పారిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆదివారం తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ సమయంలో సిబ్బంది అడ్డుకున్నారు.. దీంతో మనస్థాపానికి గురై విషం తాగి ఆత్మహత్యకు పాల్పపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీనియర్ ఐఏఎస్ అధికారి రంజీత్ కుమార్ జై, గురజాత్ లోని ఎలక్ట్రిసిటీ రెగ్యూలేషన్ కమిషన్ లో సెక్రటరీ హూదాలో విధులు నిర్వహిస్తున్నారు. గాంధీనగర్ సెక్టార్ 19 లోని అధికారిక నివాసంలో ఉంటున్నారు. రంజీత్ భార్య సూర్య జై గత ఏడాది నవంబర్ లో తన స్వస్థలం తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌స్టర్ హైకోర్టు మహరాజతో కలిసి వెళ్లిపోయింది.
పిల్లల్ని, తనను కాదని వెళ్లిపోయిన సూర్య జై పై కోపంతో ఆమెకు విడాకులు ఇవ్వాలని రంజిత్ నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఆమె తిరిగి వస్తే ఇంట్లోకి రానివ్వొద్దని సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు విడాకుల ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సూర్య జై.. రంజీత్ ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో ఇంట్లోకి రావడానికి వీల్లేదని సార్ చెప్పారని సిబ్బంది గట్టిగా చెప్పారు. దీంతో ఆమె మనస్థాపానికి గురై విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.. వెంటనే సిబ్బంది హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.. ఆమె కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.