iDreamPost
android-app
ios-app

అదానీ కంపెనీకే షాక్‌ ఇచ్చిన దొంగలు.. ఏకంగా బ్రిడ్జీ మాయం చేశారు!

  • Published Jul 08, 2023 | 4:07 PM Updated Updated Jul 08, 2023 | 4:07 PM
  • Published Jul 08, 2023 | 4:07 PMUpdated Jul 08, 2023 | 4:07 PM
అదానీ కంపెనీకే షాక్‌ ఇచ్చిన దొంగలు.. ఏకంగా బ్రిడ్జీ మాయం చేశారు!

గౌతమ్‌ అదానీ.. ఇతడి గురించి తెలియని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యకాలంలో అదానీ పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక అదానీ చేయని వ్యాపారం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు అదానీ. అలాంటి అదానికి తాజాగా భారీ షాక్‌ తగిలింది. దొంగలు అదానీని టార్గెట్‌ చేశారు. అతడి కంపెనీ ఏర్పాటు చేసిన సుమారు 6 వేల కేజీల టన్నుల ఇనుప బ్రిడ్జీని దొంగిలించారు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అదానీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. దొంగలు అదానీ కంపెనీకి చెందిన భారీ బ్రిడ్జీని ఎత్తుకెళ్లారు.

ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఈ దొంగతనం చోటు చేసుకుంది. అదానీ ఎలక్ట్రిసిటీ కంపెనీకి చెందిన ఓ భారీ బ్రిడ్జిని ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ దొంగతనం గురించి తెలుసుకుని పోలీసులు, స్థానికులు, అదానీ ఎలక్ట్రిసిటీ యాజమాన్యం షాక్‌తో నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఈ భారీ బ్రిడ్జీ ఉంది.. నిత్యం ఎప్పుడూ రద్దీగా ఉండే మార్గంలో ఉంది. పైగా ఇది 90 అడుగుల పొడవు.. 6 వేల కిలోల బరువు ఉండటం గమనార్హం. అసలు ఇంత భారీ వంతెన ఎలా చోరికి గురయ్యింది.. ఎవరు ఈ దొంగతనం చేశారనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అదానీ ఎలక్ట్రిసిటీ కంపెనీ.. ముంబై, మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ కాలువపై ఈ ఇనుప వంతెనను 2022 జూన్‌ నెలలో తాత్కాలికంగా నిర్మించింది. అదానీ సంస్థకు చెందిన భారీ ఎలక్ట్రిక్ వైర్లను తరలించేందుకు ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అయితే కొద్ది కాలం తర్వాత.. అనగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇదే కాలువపై మరో బ్రిడ్జీని నిర్మించారు. కొత్త వంతెన అందుబాటులోకి రావడంతో.. అదానీ కంపెనీ గత ఏడాది నిర్మించిన బ్రిడ్జీని వినియోగించటం లేదు. మొదట నిర్మించిన ఇనుప వంతెన వినియోగంలో లేకపోవడంతో.. ఇదే అదునుగా భావించిన దొంగలు దాన్ని ఎత్తుకెళ్లారు. దీని బరువు 6 వేల కిలోల బరువు ఉండటం గమనార్హం.

నిత్యం వాహనాలు, ప్రజలతో రద్దీగా ఉండే మలాడ్ ప్రాంతంలో ఈ బ్రిడ్జిని దొంగలు చోరీ చేయడంపై స్థానికులు, పోలీసులు, అదానీ ఎలక్ట్రిసిటీ యాజమాన్యం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వంతెన దొంగతనానికి గురైనట్లు గుర్తించిన అదానీ సంస్థ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వంతెన చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. దొంగతనం జరిగిన తీరు తెలుసుకుని నోరెళ్లబెట్టారు. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి బ్రిడ్జిని ముక్కలుగా చేసి ఆ తర్వాత వాటిని తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ముక్కలను ఒక భారీ ట్రక్కులో అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.

ఈ నలుగురిలో ఒకరికి ఈ వంతెన ఏర్పాటుతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నిందితుడు ఈ వంతెన నిర్మించినపుడు అదానీ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురు అతడికి సహకరించారని వెల్లడించారు. ఈ నలుగురురి అదుపోలకి తీసుకున్న పోలీసులు.. దీని వెనక ఎవరైనా ఉన్నారా అన్న యాంగిల్‌లో విచారిస్త్ననారు. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.