iDreamPost
android-app
ios-app

వీడియో: సినిమా స్టైల్లో పట్ట పగలు నగల షాపు దొంగతనం!

  • Published Aug 02, 2023 | 2:47 PM Updated Updated Aug 02, 2023 | 2:47 PM
  • Published Aug 02, 2023 | 2:47 PMUpdated Aug 02, 2023 | 2:47 PM
వీడియో: సినిమా స్టైల్లో పట్ట పగలు నగల షాపు దొంగతనం!

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వం వహించిన ‘ బ్యాట్‌ మ్యాన్‌ : డార్క్‌ నైట్‌ రైజెస్ ’ సినిమాలో ఓ బ్యాంక్‌ దొంగతనం సీను ఉంటుంది. అందులో విలన్‌ తన అనుచరులతో కలిసి బ్యాంకులో చోరీ చేస్తాడు. అది కూడా పట్టపగలు బ్యాంకును మొత్తం దోపిడీ చేస్తాడు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. అయితే, ఈ సంఘటనలో కొంతమంది దుండగులు బ్యాంకును కాకుండా ఓ జ్యువెలరీ షాపును దోచేశారు. ఏకంగా కోట్ల రూపాయలు విలువ చేసే నగల్ని ఎత్తుకెళ్లారు.

ఆ వివరాల్లోకి వెళితే.. ప్రాన్స్‌ రాజధాని పారిస్‌.. నగల దుకాణాలకు చాలా ఫేమస్‌. ఇక్కడ అత్యంత ఖరీదైన నగలు, వాచీలు అమ్ముతూ ఉంటారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కొందరు దుండగులు మారు వేషంలో.. గన్నులతో రియో డెలా పేక్స్‌లోని ఓ నగల దుకాణంలోకి చొరబడ్డారు. లోపల ఉన్న వారిని బెదిరించి.. నగల్ని, వాచీలను దోచుకోవటం మొదలుపెట్టారు. దాదాపు 16.5 మిలియన్‌ డాలర్లు ఖరీదు చేసే నగలు, వాచీలను దొంగతనం చేశారు. తర్వాత అక్కడినుంచి పరారయ్యారు.

అయితే, వారు అక్కడున్న వారిలో ఎవ్వరినీ కూడా గాయపర్చలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. దోపిడీకి పాల్పడ్డ వారిలో ఇద్దరు పురుషులతో పాటు ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దుండుగులు నగల దుకాణాన్ని దోచుకుంటున్నపటి దృశ్యాల తాలూకా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet